600 ఏళ్ల క్రితం పూజా హెగ్డే ఎలా ఉండేదో తెలుసా..

ఆరు వందల ఏళ్ల క్రితం పూజా హెగ్డే ఎలా ఉండేదో తెలుసా.. పూజా హెగ్డే ఏంటి ఆరు వందల ఏళ్ల క్రితం అని డౌట్ పడుతున్నారా..

news18-telugu
Updated: September 26, 2019, 10:44 AM IST
600 ఏళ్ల క్రితం పూజా హెగ్డే ఎలా ఉండేదో తెలుసా..
పూజా హెగ్డే ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
ఆరు వందల ఏళ్ల క్రితం పూజా హెగ్డే ఎలా ఉండేదో తెలుసా.. పూజా హెగ్డే ఏంటి ఆరు వందల ఏళ్ల క్రితం అని డౌట్ పడుతున్నారా.. ఏమి లేదు.. పూజా హెగ్డే ..హిందీలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో  బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హౌస్‌ఫుల్4’. ఈ సినిమాలో పూజా హెగ్డే ముఖ్యపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.  ఫర్హాద్ సామ్‌జీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ 600 ఏళ్ల క్రితం నాటి బాలా పాత్రలో గుండుతో కనిపించబోతున్నాడు. ముందుగా ఈ సినిమా సాజిద్ ఖాన్ దర్శత్వంలో ప్రారంభమైంది. ఆయనపై మీటూ ఆరోపణలు రావడంతో స్వచ్ఛందంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆయన ప్లేస్‌లో ఫర్హాద్ సామ్జీ ఈసినిమాను డైరెక్ట్ చేసాడు.

హౌస్‌ఫుల్ 4లో అక్షయ్ కుమార్ (Twitter/Photo)


మరోవైపు హ్యారీ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గెటప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు రాజ నర్తకుడు బంగ్‌డు మహారాజ్ పాత్రలో రితేష్ దేశ్‌ముఖ్, రాజకుమారి మాల పాతర్లో పూజా హెగ్డే యాక్ట్ చేసింది.

రాజ కుమారి మాల పాత్రలో పూజా హెగ్డే (Twitter/Photo)


రాజకుమారి మధుగా కృతి, అంగరక్షక్ ధర్మపుత్రగా బాబీ డియోల్ యాక్ట్ చేసారు. పునర్జన్మల నేపథ్యంలో 1419, 2019 మధ్యకాలంలో జరిగే కథ నేపథ్యంలో పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రానా ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల కానుంది.
First published: September 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading