సమంత Vs పూజా హెగ్డే.. సోషల్ మీడియా మోతెక్కిపోతుందిగా..

Samantha Vs Pooja Hegde: ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య వార్ జరిగితే రచ్చ ఈ స్థాయిలో ఉంటుందా..? ఇప్పటి వరకు హీరోల అభిమానుల మధ్య మాత్రమే ఎక్కువగా యుద్ధ వాతావరణం చూస్తుంటాం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 28, 2020, 11:05 PM IST
సమంత Vs పూజా హెగ్డే.. సోషల్ మీడియా మోతెక్కిపోతుందిగా..
సమంత, పూజా హెగ్డే (Instagram/Photos)
  • Share this:
ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య వార్ జరిగితే రచ్చ ఈ స్థాయిలో ఉంటుందా..? ఇప్పటి వరకు హీరోల అభిమానుల మధ్య మాత్రమే ఎక్కువగా యుద్ధ వాతావరణం చూస్తుంటాం. తమ హీరోను ఏదైనా చిన్న మాట అంటే వెంటనే రెచ్చిపోతుంటారు ఫ్యాన్స్. అలాంటిదిప్పుడు సమంత ఫ్యాన్స్ చేస్తున్నారు. పూజా హెగ్డే చేసిన కామెంట్‌తో వాళ్లు చెలరేగిపోతున్నారు. వెంటనే తమ హీరోయిన్‌కు పూజా సారీ చెప్పాల్సిందే అంటూ పెద్ద రచ్చే చేస్తున్నారు. పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో సమంతపై చేసిన కామెంట్ ఇప్పుడు ధావాళంగా వ్యాపించింది.
సమంత వర్సెస్ పూజా హెగ్డే (pooja hegde samantha)
సమంత వర్సెస్ పూజా హెగ్డే (pooja hegde samantha)


మజిలీ సినిమాలోని సమంత స్క్రీన్ షాట్ చూపిస్తూ అందులో అంత అందంగా ఏం లేదని.. అలా ఉంటుందని కూడా తాను అనుకోవడం లేదని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది పూజా. ఇది చూసిన తర్వాత సమంత అభిమానులు రెచ్చిపోయారు. ఆ ఫోటో తీసి ఏకేస్తున్నారు.

#PoojaMustApologizeSamantha అనే హ్యాష్ ట్యాగ్‌తో పూజా హెగ్డేను ఆడుకుంటున్నారు. ఆమెకు వ్యతిరేకంగా వేలల్లో ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇండియాలో నెంబర్ వన్ ట్రెండ్ అవుతుందంటే రచ్చ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పూజా హెగ్డే వర్షన్ మరోలా ఉంది.


తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని ఈ రచ్చ జరిగిన కాసేపటికి ఈమె ట్వీట్ చేసింది. తన టీమ్‌కు సమాచారం ఇచ్చానని.. తన డిజిటల్ టీమ్ దీనిపై వర్క్ చేస్తుందని చెప్పుకొచ్చింది పూజా. దయచేసిన ఎలాంటి ఇన్విటేషన్లను యాక్సెప్ట్ చేయకండని చెప్పింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ భద్రత కోసం గంట పాటు చాలా కష్టపడ్డామని.. ఇలాంటి సమయంలో తన కోసం పని చేసిన టెక్నికల్ టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపింది ఈమె. మొత్తానికి మళ్లీ నా ఇన్‌స్టాగ్రామ్ నా చేతుల్లోకి వచ్చిందంటూ ఆనందంగా పోస్ట్ చేసింది పూజా హెగ్డే.


అయితే సమంత విషయంలో జరిగిన తప్పుకు మాత్రం ఆమె సారీ చెప్పలేదు. కానీ వెంటనే ఆ పోస్టులను మాత్రం తీసేసింది పూజా. ఆ తర్వాత చేసిన ట్వీట్స్‌లో సమంత గురించి ప్రస్థావించకపోవడం.. అసలేం జరగనట్లే ఉండటంతో ఫ్యాన్స్‌కు మరింత చిర్రెత్తికొచ్చింది. సమంత చేసిన సినిమాలను.. పూజా హెగ్డే చేసిన సినిమాలను కంపేర్ చేస్తూ ఆడుకుంటున్నారు ఫ్యాన్స్. తమ హీరోయిన్‌తో పోలిస్తే నువ్వెంత అంటున్నారు. ఈ రచ్చ అంతా జరుగుతుంటే సమంత మాత్రం చాలా కూల్‌గా విక్టరీ సింబల్ చూపిస్తూ దిగిన ఫొటోను ట్వీట్ చేసింది. దాంతో అభిమానులు కాస్త చల్లబడుతున్నారు.
First published: May 28, 2020, 11:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading