Pooja Hegde: పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో మారు మ్రోగుతున్న పేరు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో జపిస్తోన్న పేరు పూజానే. ఈమె ఓ వైపు షూటింగ్స్‌తో బిజీగా ఉంటూనే.. తనకు సంబంధించిన ఫ్యాషన్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ వీకెండ్‌లో దిల్ రాజు పార్టీలో సందడి చేసిన బుట్టబొమ్మ.. ఈ శనివారం మాత్రం వైట్ అండ్ డ్రెస్‌లో మెరిసిపోయింది. దానికి సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ.. ప్రభాస్‌తో రాధేశ్యామ్‌లో నటిస్తోంది. మరోవైపు అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఇపుడు సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దీవాళీ’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది.
మరోవైపు పూజా హెగ్గే ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా ‘సలార్’ మూవీలో యాక్ట చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కేజీఎఫ్ సినిమాను నిర్మిస్తున్న విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే ఈ సినిమా కోసం బల్క్‌గా డేట్స్ కేటాయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ భామ.. సల్మాన్ సినిమా తర్వాత ప్రభాస్ సినిమా కోసం మరోసారి రంగంలోకి దిగనుంది. ఒక రకంగా తన సొంత భాషలో నటించడం పై పూజా హెగ్డే ఆనందం వ్యక్తం చేస్తోందట. తొలిసారి కన్నడ భాషలో అది క్రేజీ ప్యాన్ ఇండియా మూవీతో ఎంట్రీ ఇవ్వడం పై ఆనందం వ్యక్తం చేస్తుంది.
— Pooja Hegde (@hegdepooja) December 19, 2020
పూజా హెగ్డే తెలుగులో.. నాగ చైతన్య హీరోగా నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పరిచమైంది. అంతకు ముందు ఈమె తమిళంలో జీవా హీరోగా నటించిన ‘మూగముడి’లో నటిచింది. ఆ తర్వాత పూజా హెగ్డే.. వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మగా మురిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో పలకరించింది.ఆ సినిమా సక్సెస్ కాకపోవడంత హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో పూజా తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఆ తరవాత వెనుదిరిగి చూసుకోలేదు.
ఆ తర్వాత ‘రంగస్థలం’లో ఐటెం భామగా పలకరించింది. ఆపై ‘సాక్ష్యం’ సినిమాలో బెల్లంకొండతో ఆడిపాడింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’లో అరవిందగా టైటిల్‌లో రోల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘మహర్షి’, ఆపై త్రివిక్రమ్ , అల్లు అర్జున్‌తో రెండోసారి ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో హాట్రిక్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్‌గా తన సత్తా చూపెడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Pooja Hegde, Tollywood