ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాను ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే ..కేవలం సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేస్తుంటుంది. కొత్త కొత్త ఫొటోలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఇందులో గ్లామర్ స్టిల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు గ్లామర్‌తో నిండిన పూజా హెగ్డే ఫొటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా అందాలను ఆరబోయడానికి వెనుకాడని పూజాహెగ్డే లేటెస్ట్ ఫొటోలోనూ అందాల విందును అందించే ప్రయత్నం చేసింది. సోయగాలను చూపించే పైదుస్తులతో పాటు కాళ్లు కనిపించేలా డ్రెస్ వేసుకున్న పూజా హెగ్డే ఫొటోలోని అందం చూసి కుర్రకారు మతులు పోతున్నాయి.
ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురములో చిత్రంలో బన్నీ జోడీగా పూజా హెగ్డే జోడీ కట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లోనూ జత కట్టింది. ఈ రెండు సినిమాలు కాకుండా బాలీవుడ్‌లో రణ్వీర్ సింగ్ చేస్తున్న సర్కస్ చిత్రంలోనూ నటిస్తుంది. ఈ సినిమా కాకుండా దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందనున్న మరో చిత్రంలోనూ నటించడానికి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇంత బిజీ బిజీగా ఉన్న అమ్మడు గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకోవడంతో దర్శక నిర్మాతలు ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.
కెరీర్ ప్రారంభంలో ముగమూడి(తెలుగులో మాస్క్) అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే.. నాగచైతన్యతో జోడీ కట్టిన ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుణ్‌తేజ్‌తో ముకుంద సినిమాలోనూ ఆడిపాడింది. హీరోయిన్‌గా కెరీర్ స్పీడు అందుకుంటున్న తరుణంలో బాలీవుడ్‌లో మొహంజదారో సినిమాలో నటించింది. అది డిజాస్టర్ కావడంతో మళ్లీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. బన్నీతో చేసి డీజే దువ్వాడ జగన్నాథమ్ నుండి పూజా కెరీర్ స్పీడందుకుంది. తర్వాత సూపర్ స్టార్ మహేశ్‌తో మహర్షి సినిమాలో నటించింది. రామ్‌చణ్ రంగస్థలంలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆకట్టుకుంది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో అరవింద సమేతలో జోడీ కట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Tollywood