మెగా హీరోలకు లక్కీ మస్కట్‌గా మారిన పూజా హెగ్డే ..

ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.. కొంత మంది ఒక్క నైట్ లో స్టార్ హోదా దక్కించుకోవచ్చు. కొంతమంది ఎన్ని ఏళ్ల నుండి సినిమా చేసినా సరైన గుర్తింపు ఉండదు. తాజాగా పూజా హెగ్డే మెగా హీరోల పాలిట లక్కీ మస్కట్‌గా మారింది.

news18-telugu
Updated: January 19, 2020, 1:39 PM IST
మెగా హీరోలకు లక్కీ మస్కట్‌గా మారిన పూజా హెగ్డే ..
పూజా హెగ్డే (Instagram/Photo)
  • Share this:
ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.. కొంత మంది ఒక్క నైట్ లో స్టార్ హోదా దక్కించుకోవచ్చు. కొంతమంది ఎన్ని ఏళ్ల నుండి సినిమా చేసినా సరైన గుర్తింపు ఉండదు. ఒక్కోసారి ముందు ఐరెన్ లెగ్ ట్యాగ్ లైన్ వేసుకొని.. ఆ తర్వాత వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ కూడా వున్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే అదృష్టం వస్తే బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి అన్న సామెత ఫిలిం ఇండస్ట్రీకి  అచ్చంగా సరిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవ ఉండదు.ఆలా ఆ సెంటిమెంట్స్ లిస్టులో మరో సెంటిమెంట్ వొచ్చిచేరింది .. అదేంటంటే మెగా కాంపౌండ్ నుంచి వచ్చే సినిమా ఏదైనా సరే.. అందులో పూజాహెగ్డే ఉంటే చాలు.. హిట్టు పక్కా అని చెబుతున్నారు. అదెలా అంటే లెక్కలు తీసి మరీ చూపిస్తున్నారు ..ఒకప్పుడు ఒక్క హిట్ కోసం ముఖం వాచిపోయిన పూజ హెగ్డే .. గత కొన్నేళ్లుగా వరుస హిట్లతో తన ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటి వరకు మెగా హీరోలు నటించిన నాలుగు సినిమాల్లో నటించిన పూజా సినిమాలు హిట్ అయ్యాయి.మెగా హీరోలతో ఈ భామ నటించిన ‘ముకుంద’.. ‘డీజే’.. ‘గద్దలకొండ గణేశ్’.. ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో వరుస  హిట్లను అందుకుంది. వరుణ్ తేజ్ తో రెండుసార్లు.. తాజాగా ‘అల వైకుంఠపురములో’  అల్లు అర్జున్‌తో  రెండు సార్లు జత కట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.అంతేకాదు..  మెగా కాంపౌండ్ లో మరో హీరో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’లో ప్రత్యేక గీతంలో మెరిసింది. ఇలా మెగా హీరోల సినిమాల్లో పూజా కనిపించిన అన్ని సినిమాలు హిట్టు కొట్టేస్తున్న వైనాన్ని ప్రస్తావిస్తున్నారు.ఎప్పుడూ తన సినిమాల్లో హీరోయిన్ ను రిపీట్ చేయని బన్నీ.. రెండోసారి పూజాతో జత కట్టటమే కాదు.. మరో అవకాశం వస్తే..  మరో సినిమా పూజాతో చేయాలని ఉందని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా తెర మీదకు వచ్చిన సెంటిమెంట్‌తో మెగా హీరోల సినిమాల్లో పూజా మరిన్ని అవకాశాన్ని సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు నెటిజన్స్.  సక్సెస్ లు ఓపక్క.. సెంటిమెంట్లతో మరోపక్క ఉన్న పూజాహెగ్డేకు రానున్న రోజుల్లో మరిన్ని క్రేజీ మూవీస్ లో మరిన్ని అవకాశాలు పక్కా అని చెప్పుకుంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 19, 2020, 1:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading