గుర్తింపు రావాలంటే భిన్నంగా ఆలోచించాల్సిందే : పూజా హెగ్డే..

Pooja Hegde :  ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్స్‌లలో ఒకరుగా వెలుగుతున్న అందాల భామ. జీవితం గురించి పలు అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుని పూజా హెగ్డే.

news18-telugu
Updated: February 15, 2020, 1:06 PM IST
గుర్తింపు రావాలంటే భిన్నంగా ఆలోచించాల్సిందే : పూజా హెగ్డే..
Instagram/hegdepooja
  • Share this:
ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్స్‌లలో ఒకరుగా వెలుగుతున్న అందాల భామ పూజా హెగ్డే.  వరుసగా తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటూ అదరగొడుతోంది. నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ సినిమా ద్వారా పరిచయమై ఆ తర్వాత ‘ముకుంద’లో అదరగొట్టింది. అల్లు అర్జున్ సరసన 'డీజే' లోహాట్‌గా కనిపించిన పూజా.. ఆ తర్వాత వరుసగా ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో మహేష్‌ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసింది.  ఇటీవలే వరుణ్‌తో మరో సారి గద్దలకొండ గణేష్‌ సినిమాలో అలనాటి శ్రీదేవి హిట్ సాంగ్ 'ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో'  అనే పాటలో ఆడిపాడింది. తాజాగా ఈ భామ బన్నీతో మరోసారి 'అల వైకుంఠపురములో' నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ.. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు నేనెప్పుడూ ముందే ఉంటానని.. జీవితంలో సాహసాలు చేయడం చాలా అవసరం అని చెబుతూ.. అవే మనల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయంటోంది. పూజా మాట్లాడుతూ.. జీవితాన్ని కంఫర్టబుల్‌గా బతకడంలో ఆనందం ఉందనుకుంటారు. అందులో భాగంగానే.. ఒకే రకమైన లైఫ్‌కు అలవాటు పడిపోతుంటారు. అలా బతకడంలో తప్పు లేదు.. కానీ మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే మాత్రం.. పదిమందికంటే భిన్నంగా ఆలోచించాల్సిందే అంటోంది.  మనం కొత్తగా ప్రయత్నిస్తే.. ఎదురుదెబ్బలు తగులుతాయి. వాటిని తట్టుకుని నిలబడాలని చెబుతోంది. 

View this post on Instagram
 

“Stand up” for our Most Elegible Bachelorette for our #MostEligibleBachelor 😉😉🎙 @akkineniakhil @ga2official #BommarilluBhaskar


A post shared by Pooja Hegde (@hegdepooja) on

పూజా ఇంకా మాట్లాడుతూ.. సినిమాలు మనకెందుకు.. అనుకుంటే చాలామంది అమ్మాయిల్లానే నేనూ చదువు ,ఉద్యోగం అంటూ మిగిలిపోయేదాన్నని... కాని ‘ఓసారి ట్రై చేసి చూద్దాం’ అని గట్టిగా అనుకున్నాను అంతే.. అయితే.. ఈ ప్రయాణంలో మొదట కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చివరికి మాత్రం నా గమ్యాన్ని చేరుకున్నానంటోంది. పూజా ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ సినిమా, అఖిల్‌తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'  చేస్తోంది. దీంతో పాటు హిందీలో సల్మాన్ ఖాన్‌తో మరో సినిమా చేస్తోంది.


First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు