HOME »NEWS »MOVIE »pooja hegde has completed her shooting part in radhe shyam mhn

Pooja Hegde - Radhe Shyam: ప్రభాస్‌ 'రాధేశ్యామ్'లో తన పార్ట్‌ పూర్తి చేసిన పూజా హెగ్డే

Pooja Hegde - Radhe Shyam: ప్రభాస్‌ 'రాధేశ్యామ్'లో తన పార్ట్‌ పూర్తి చేసిన పూజా హెగ్డే
Pooja Hegde has completed her shooting part in Radhe Shyam

Pooja Hegde - Radhe Shyam: కొన్ని రోజులుగా పూజా హెగ్డే రాధేశ్యామ్‌ షూటింగ్‌తోనే గడిపింది. హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లో ప్రభాస్‌, పూజా హెగ్డేలపై పాట చిత్రీకరణ పూర్తయ్యింది. దీంతో పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన పార్ట్‌ పూర్తయ్యింది.

  • Share this:
    ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉన్న స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో తన చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్ట్‌ ఏదో కాదు. ప్యాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'రాధేశ్యామ్‌'. కోవిడ్‌ ప్రభావం తర్వాత రీస్టార్ట్‌ అయిన ఈ సినిమా షూటింగ్‌ ఎలాంటి బ్రేకులు లేకుండా చక చకా పూర్తవుతూ వస్తుంది. కొన్ని రోజులుగా పూజా హెగ్డే రాధేశ్యామ్‌ షూటింగ్‌తోనే గడిపింది. హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లో ప్రభాస్‌, పూజా హెగ్డేలపై పాట చిత్రీకరణ పూర్తయ్యింది. దీంతో పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన పార్ట్‌ పూర్తయ్యింది. ఈ విషయాన్ని పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. "భారీ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయ్యింది. 30 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైదరాబాద్‌ నుండి ముంబై వెళుతున్నాను" అంటూ పూజా హెగ్డే తెలియజేసింది. అంటే ప్యాచ్‌ వర్క్‌ సహా కొన్నిరోజుల్లోనే 'రాధేశ్యామ్‌ పూర్తి అవుతుందనడంలో సందేహం లేదు.

    పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న 'రాధేశ్యామ్‌' సినిమాను 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్నాడు. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలోని లవ్‌స్టోరి రూపొందింది. సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నాడు. ఖరీదైన కార్ల కంపెనీ యజమాని పాత్రలో ప్రభాస్‌ లుక్‌ సరికొత్తగా ఉంటుందని టాక్‌. ఎప్పటి నుండో ఈ సినిమా టీజర్‌ లాంటి అప్‌డేట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు త్వరలోనే గుడ్‌ న్యూస్‌ అందడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే మార్చి 30న ఈ సినిమాను ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.



    ప్రభాస్‌ తన తదుపరి మూవీగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందనున్న 'సలార్‌' మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. అది కూడా ఈ జనవరిలోనే ఉంటుంది. 'సలార్‌' కోసం నాలుగు నెలల డేట్స్‌ను కేటాయించాడు ప్రభాస్‌. రీసెంట్‌గా కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్‌ నారాయణ్‌, యష్‌ తదితర ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో 'సలార్‌' సినిమా లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
    Published by:Anil
    First published:January 17, 2021, 21:28 IST

    टॉप स्टोरीज