Home /News /movies /

POOJA HEGDE GOT CHANCE IN HERO YASH MOVIE AS PER LATEST SOURCE SLB

Pooja Hegde: యష్ సరసన పూజా హెగ్డే! ఈ అందం రాఖీభాయ్‌కి కలిసొచ్చేనా..?

Photo Twitter

Photo Twitter

Pooja Hegde Yash: రోజురోజుకు పూజా హెగ్డే క్రేజ్ అమాంతం రెట్టింపవుతూ వస్తోంది. జయాపజయాల సంగతి పక్కనబెడితే కెమెరా ముందు పూజా అందం, అభినయానికి మంచి మార్కులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుసపెట్టి ఆమెకు కొత్త సినిమా ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. తాజాగా రాఖీభాయ్ యష్ సరసన ఓ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందట పూజా.

ఇంకా చదవండి ...
తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషలు, బాలీవుడ్ తెరపై వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది పూజా హెగ్డే (Pooja Hegde). ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసిన ఈ అమ్మడు నేటితరం స్టార్ హీరోలకు సరైన జోడీ అనిపించుకుంటోంది. దీంతో అమ్మడి క్రేజ్ అమాంతం రెట్టింపవుతూ వస్తోంది. జయాపజయాల సంగతి పక్కనబెడితే కెమెరా ముందు పూజా అందం, అభినయానికి మంచి మార్కులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుసపెట్టి ఆమెకు కొత్త సినిమా ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. తాజాగా రాఖీభాయ్ యష్ (Yash) సరసన ఓ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందట పూజా.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ (KGF) సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన నర్తన్ అనే దర్శకుడితో యష్ తన తదుపరి సినిమా చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ముప్తీ' సూపర్ హిట్‌గా నిలవడంతో ఈ కాంబోపై జనాల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని యష్ స్వయంగా నిర్మించబోతున్నారట. ఇదే సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఫైనల్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే ఆమెతో సంప్రదింపుల కార్యక్రమం పూర్తయిందని తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ యష్ సరసన నటించే అవకాశం కావడంతో పూజా వెంటనే ఒకే చెప్పిందట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ స్టేట్ మెంట్ రానుందని అంటున్నారు.

ఇకపోతే ఇటీవలే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా రూపొందుతున్న 'జనగణమన' (Janaganama) మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ఆమె పలు సినిమాల కథలు వింటూ పాత్ర నచ్చితే ఓకే చేస్తోందట. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటోందట.

హిందీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన 'కభీ ఈద్ కభీ దీవాళీ' (Kabhi Eid Kabhi Diwali) అనే సినిమా షూటింగ్‌లోనూ మరికొద్ది రోజుల్లో జాయిన్ కాబోతోంది పూజా హెగ్డే. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్ కూడా నటిస్తుండగా పూజా రోల్ కీలకం కానుందట. అలాగే మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందనున్న సినిమాలోనూ పూజా హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ అయింది. ఇదంతా ఓ ఎత్తతయితే పూజాను పెట్టుకుంటే యష్‌కు హిట్టు పడేనా అనేవారు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆమె చేసిన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో ఈ టాక్ నడుస్తోంది.
Published by:Sunil Boddula
First published:

Tags: Pooja Hegde, Tollywood actress, Yash

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు