హోమ్ /వార్తలు /సినిమా /

Pooja Hegde: ఇలియానా రూట్లోనే వెళ్తున్న పూజా హెగ్డే... వర్కవుట్‌ అవుతుందా?

Pooja Hegde: ఇలియానా రూట్లోనే వెళ్తున్న పూజా హెగ్డే... వర్కవుట్‌ అవుతుందా?

పూజా హెగ్డే Photo : Instagram

పూజా హెగ్డే Photo : Instagram

Pooja Hegde - Vijay 65: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో పూాజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుందని సినీ వర్గాల సమాచారం.

పూజా హెగ్డే ఇప్పుడు బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు. ఇన్నాళ్లూ నార్త్ మీద మనసు పడ్డ ఈ బ్యూటీకి ఉన్నపళాన సౌత్‌ మీద ప్రేమ ఎక్కువైంది. అంటే ఇంతకు ముందు లేదని కాదు కానీ, ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు మరింత ఎక్కువైందని అర్థం అన్నమాట. అప్పుడెప్పుడో ఏడెనిమిదేళ్ల ముందు తమిళంలో ఓ సినిమా చేసిన పూజా హెగ్డే ఆ తర్వాత అటువైపే చూడలేదు. బాలీవుడ్‌, టాలీవుడ్‌ అంటూ స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ని ఎంజాయ్‌ చేస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా దుల్కర్‌తో ఓ మలయాళం మూవీని చేయడానికి యాక్సెప్ట్ చేశారు. అటు మలయాళం వైపు ఇంట్రస్ట్ పెంచుకుంటున్నారని అనుకునేలోపు, మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతోంది.

ఇప్పుడు పూజా హెగ్డే చేయబోతున్న సినిమాలో హీరో మరెవరో కాదు... విజయ్‌. ఇళయదళపతి విజయ్‌తో జోడీ కట్టడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట పూజా. ఈ ఇయర్‌లో లాస్ట్ వర్కింగ్‌ డే పూజాకి పూర్తయింది. సో నెక్స్ట ఇయర్‌లో ఆమె వెళ్లబోయే సెట్స్ లో విజయ్‌ మూవీ సెట్‌ మోస్ట్ హ్యాపెనింగ్‌ సెట్‌ కానుంది. సన్‌ పిక్చర్స్ ఈ సినిమా కోసం పూజా హెగ్డేకి భారీగానే రెమ్యునరేషన్‌ ఇస్తున్నారని టాక్‌. నెల్సన్‌కి డైరక్టర్‌గా ఇప్పటికే మంచి పేరుంది. నెల్సన్‌ టేకింగ్‌ మీద నమ్మకంతోనే తాను ఈ ప్రాజెక్టుకు సైన్‌ చేశానని పూజా హెగ్డే తన సన్నిహితులతో చెప్పుకుంటున్నారట. పూజాకి తమిళ్‌లో మాట్లాడటం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే ఆమె సౌత్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ మీద కూడా గ్రిప్‌ పెరుగుతోంది.

గతంలో టాలీవుడ్‌లో క్రేజ్‌ బాగా ఉన్నప్పుడే, అటు బాలీవుడ్‌, ఇటు కోలీవుడ్‌లోనూ జండా పాతే ప్రయత్నం చేశారు ఇలియానా. అప్పట్లో ఆమె కూడా తమిళ్‌లో చేయడానికి విజయ్‌ మూవీనే సెలక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు సేమ్‌ టు సేమ్‌ పూజా హెగ్డే కూడా ఇలియానా రూట్లోనే వెళ్తున్నట్టు అనిపిస్తోంది.

First published:

Tags: Kollywood News, Pooja Hegde, Vijay

ఉత్తమ కథలు