Pooja Hegde: పూజా హెగ్డే.. ప్రస్తుతం తెలుగుతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలోని హీరోలు ఈమె నామాన్నే పూజిస్తున్నారు. తెలుగులో వరుస సక్సెస్‌లతో మంచి ఊపు మీదున్న ఈ భామ.. గతేడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత అక్కడ కూడా బిజీ అయింది. ఐతే.. ఈ శాండిల్‌వుడ్ భామకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అంటే పిచ్చి అభిమానమట. ఇపుడు అతనితో కలిసి ‘కభీ ఈద్ కభీ దీవాళి’ సినిమాలో కలిసి నటిస్తోంది. ఈ సినిమాను కూడా ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన మొదటిసారి నటిస్తోంది. ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. ఈ రోజు తన జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు అంటూ చెప్పుకొచ్చింది. హిందీలో పూజా హెగ్డే నటిస్తోన్న మూడో చిత్రం ఇది.తెలుగులో పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పరిచమైంది. ఆ తర్వాత పూజా హెగ్డే.. వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మగా మురిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో పలకరించింది.ఆ సినిమా సక్సెస్ కాకపోవడంత హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో పూజా తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఆ తరవాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ‘రంగస్థలం’లో ఐటెం భామగా పలకరించింది. ఆపై ‘సాక్ష్యం’ సినిమాలో బెల్లంకొండతో ఆడిపాడింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’లో అరవిందగా టైటిల్‌లో రోల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘మహర్షి’, ఆపై త్రివిక్రమ్ , అల్లు అర్జున్‌తో రెండోసారి ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో హాట్రిక్ సక్సెస్ అందుకుంది.
ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు అఖిల్ హీరోగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘కభీ ఈద్ కభీ దీవాళి’ సినిమాల్లో యాక్ట్ చేయబోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Radhe Shyam, Salman khan, Tollywood