హోమ్ /వార్తలు /సినిమా /

Pooja Hegde: ఇన్నేళ్ల కెరీర్‌లో పూజా హెగ్డే చిరకాల కోరిక అలా తీరబోతుందట..

Pooja Hegde: ఇన్నేళ్ల కెరీర్‌లో పూజా హెగ్డే చిరకాల కోరిక అలా తీరబోతుందట..

పూజా హెగ్డే (Instagram/Photo)

పూజా హెగ్డే (Instagram/Photo)

Pooja Hegde: పూజా హెగ్డే.. ఇన్నేళ్ల కెరీర్‌లో ఆమె చిరకాల కోరిక త్వరలో తీరబోతుంది. దీంతో ఈ బుట్టబొమ్మ ఎగిరి గంతేసినంత పని చేస్తోంది.

Pooja Hegde: పూజా హెగ్డే.. ఇన్నేళ్ల కెరీర్‌లో ఆమె చిరకాల కోరిక త్వరలో తీరబోతుంది. దీంతో ఈ బుట్టబొమ్మ ఎగిరి గంతేసినంత పని చేస్తోంది. ప్రజెంట్.. పూజా హెగ్డే..  తెలుగుతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలోని హీరోలకు హాట్ ఫేవరేట్‌గా మారింది. టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో మంచి ఊపుమీదుంది.  గతేడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత అక్కడ కూడా బిజీ అయింది. ఇపుడు సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దీవాళీ’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది. తాజాగా ఈ భామకు మరో బంపరాఫర్ తగిలింది. కన్నడ భామగా తెలుగు,తమిళం,హిందీలో యాక్ట్ చేసిన ఈ భామ... తన మాతృ భాష కన్నడలో ఇంత వరకు ఒక్క సినిమాలో యాక్ట్ చేయలేదు. ఇపుడా అవకాశం ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా ‘సలార్’ మూవీతో దక్కించుకుబోతుంది. ఈ సినిమాను కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా ప్యాన్ ఇండియా మూవీ అయినా.. ఈ సినిమాను కన్నడ భాషా నటీనటులతో నిర్మిస్తున్నారు. అందుకే ఈ సినిమాలో కథానాయికగా పాపులర్ అయిన కన్నడ భామ అయిన పూజా హెగ్డేను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే పూజా హెగ్డే.. ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా తర్వాత మరోసారి ‘సలార్’లో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాను కేజీఎఫ్‌ సినిమాను నిర్మిస్తున్న విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే ఈ సినిమా కోసం బల్క్‌గా డేట్స్ కేటాయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ భామ.. సల్మాన్ సినిమా తర్వాత ప్రభాస్ సినిమా కోసం మరోసారి రంగంలోకి దిగనుంది.  ఒక రకంగా తన సొంత భాషలో నటించడం పై పూజా హెగ్డే ఆనందం వ్యక్తం చేస్తోందట. తొలిసారి కన్నడ భాషలో అది క్రేజీ ప్యాన్ ఇండియా మూవీతో ఎంట్రీ ఇవ్వడం పై ఆనందం వ్యక్తం చేస్తుందట.

Pooja hegde Will Romance with Prabhas in Prashanth Neel Salaar Movie,Pooja Hegde,Pooja hegde salaar prabhas prashanth neel,pooja hegde again romance with prabhas,pooja hegde prabhas salaar,Salman khan,Pooja Hegde Salman Khan,Pooja hegde Salman kbhi eid kabhi diwali,Pooja Hegde Interview,Pooja hegde Favorate Movie,Pooja Hegde Aravinda Sametha Veera Raghava,Pooja Hegde bikini pics,Pooja Hegde controversial comments,Pooja Hegde looks ravishing in her latest insta pics,pooja hegde paris tour pics,pooja hegde paris tour,happy birthday pooja hegde,pooja hegde,pooja hegde,ala vaikunthapuramulo,ala vaikunthapurramuloo,pooja hegde twitter,pooja hegde instagram,pooja hegde facebook,ala vaikuntapuram,ala vaikunthapuramulo teaser,ala vaikunthapurramuloo songs,ala vaikuntapuramlo,ala vaikunthapurramuloo teaser,ala vaikunthapurramuloo trailer,ala vaikuntapuram lo,ala vaikuntapuramulo,ala vaikunta puram lo teaser,ala vaikunta puram lo,ala vaikunthapuramulo movie,ala vaikuntapuram lo songs,ala vaikunta puram lo songs,ala vaikunta puram,housefull4,house full 4,hf4,tollywood,telugu cinema,పూజా హెగ్డే,పూజా హెగ్డే అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో పూజా హెగ్డే,అల్లు అర్జున్ పూజా హెగ్డే,పూజా హెగ్డే,తెలుగు ఇండస్ట్రీపై పూజా హెగ్డే కాంట్రవర్షల్ కామెంట్స్,అరవింద సమేత వీరరాఘవ,పూజా హెగ్డే,సల్మాన్ ఖాన్,పూజా హెగ్డే సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే కభీ ఈద్ కబీ దీవాళి,ప్రభాస్, పూజా హెగ్డే,పూజా హెగ్డే ప్రభాస్ సలార్
ప్రభాస్, పూజా హెగ్డే (Twitter/Photo)

తెలుగులో పూజా హెగ్డే..  నాగ చైతన్య హీరోగా నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పరిచమైంది. అంతకు ముందు ఈమె తమిళంలో జీవా హీరోగా నటించిన ‘మూగముడి’లో నటిచింది.  ఆ తర్వాత పూజా హెగ్డే..  వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మగా మురిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో పలకరించింది.ఆ సినిమా సక్సెస్ కాకపోవడంత హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో పూజా  తన  గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఆ తరవాత వెనుదిరిగి చూసుకోలేదు.

Happy Birthday Rebel Star prabhas craze in peak now he accept one by one crazy projects after radhe shyam movie,Happy Birthday Prabhas,HBDPrabhas,Rebel star Prabhas,prabhas radhe shyam,Prabhas,prabhas adipurutsh,prabhas crazy projects.prabhas radhe shyam,prabhas nag ashwin,prabhas om raut,prabhas prashanth neel,prabhas,prabhas 22, adipurish, Prabhas Om Raut,Saif Alikhan, Om raut direction prabhas hero,om raut prabhas combination,Prabhas prashanth neel,prashanth neel,prashanth neel,prabhas radhe shyam,radhe shyam,prabhas nag ashwin,Prabhas twitter,prabhas instagram,prabhas facebook,Prashanth neel twitter,prashanth neel instagram,prashanth neel facebook,prashanth neel, prabhas news,prabhas nag ashwin movie,nag ashwin about prabhas next movie heroine is deepika padukone,prabhas new movie,nag ashwin about prabhas next movie heroine,prabhas upcoming film,prabhas movie,prabhas nag ashwin movie story,nag ashwin prabhas movie,prabhas next movie,prabhas movies,nag ashwin about prabhas movie name heroine and story,deepika padukone,nag ashwin vijay devarakonda,ప్రభాస్, దీపికా పదుకొనే, prashanth neel,ప్రశాంత్ నీల్,ప్రశాంత్ నీల్,ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్,ప్రభాస్ 22వ చిత్రం,ప్రభాస్ నాగ్ అశ్విన్,ప్రభాస్ ప్రశాంత్ నీల్,ఓం రౌత్,ప్రభాస్,ప్రభాస్ ఓం రౌత్,ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ,హ్యాపీ బర్త్ డే ప్రభాస్,రెబల్ స్టార్ ప్రభాస్,ప్రభాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు
రాధే శ్యామ్‌లో ప్రభాస్,పూజా హెగ్డే (Twitter/Photo)

ఆ తర్వాత ‘రంగస్థలం’లో ఐటెం భామగా పలకరించింది. ఆపై  ‘సాక్ష్యం’  సినిమాలో బెల్లంకొండతో ఆడిపాడింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’లో అరవిందగా టైటిల్‌లో రోల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘మహర్షి’, ఆపై త్రివిక్రమ్ , అల్లు అర్జున్‌తో రెండోసారి ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో హాట్రిక్ సక్సెస్ అందుకుంది.ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు అఖిల్ హీరోగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది.అటు బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘కభీ ఈద్ కభీ దీవాళి’ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. తాజాగా ‘సలార్’ అనే కన్నడ, తెలుగు, హిందీ ప్యాన్ ఇండియా మూవీతో  శాండిల్‌ వుడ్‌లో అడుగుపెట్టబోతుండటంతో పూజా హెగ్డే  ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుందట.

First published:

Tags: Bollywood, Pooja Hegde, Prabhas, Prashanth Neel, Salaar, Sandalwood, Tollywood

ఉత్తమ కథలు