హోమ్ /వార్తలు /సినిమా /

Pooja Hegde: పూజా ధరించిన ఈ డ్రెస్ కాస్ట్ తెలిస్తే.. మీరు నోరెళ్లబెట్టాల్సిందే !

Pooja Hegde: పూజా ధరించిన ఈ డ్రెస్ కాస్ట్ తెలిస్తే.. మీరు నోరెళ్లబెట్టాల్సిందే !

పూజా హెగ్డే

పూజా హెగ్డే

పర్ఫెక్ట్ డిజైన్ తో తయారైన ఈ డ్రెస్ ను ధరిస్తే అదనంగా జ్యూవెలరీని ధరించాల్సిన అవసరం అయితే ఉండదు. చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఈ డ్రెస్ కాస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న హీరోనయిన్... పూజా హెగ్డే(Pooja Hegde). వరుస సినిమాలతో ఈ భామ ఫుల్ బిజీగా మారింది. తాజాగా పూజా.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival) లో డెబ్యూ ఇచ్చింది. తొలిసారి ఈ ఈవెంట్ కి ఆహ్వానం రావడంతో రెడ్ కార్పెట్ పై హొయలు ఒలికించడంతో పాటు.. రకరకాల ఫొటోషూట్స్ ఎట్రాక్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా సాగర తీరంలో వైట్ డ్రెస్ తో ఈమె చేసిన ఫొటోషూట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఫొటోషూట్ లో ఆమె వేసుకున్న వైట్ కలర్ డ్రెస్ పై ఇప్పుడు  హాట్ టాపిక్‌గా మారింది.

వైట్ డ్రెస్ లో దిగిన ఫోటోలను పూజా హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో పూజా హెగ్డే మరింత అందంగా కనిపిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ డ్రెస్ వెనుక చాలా పెద్ద కథ ఉందని చెబుతున్నారు ఆస్ట్రేలియాకు చెందిన డిజైనర్ టోనీ మేటిసెవ్ స్కీ. ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటంటే.. ఎక్కడా కూడా హ్యాంగ్ అవుతున్నట్లు కనిపించదట. ఓ పక్క బాడీకి అతుక్కుపోయినట్లు కనిపిస్తూనే.. మరోపక్క ఎద, మెడ భాగంలో పెర్ఫెక్ట్ డిజైనింగ్ ఇస్తుందట. అందుకే దీనికి ఇంత రేటు పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. పైగా ఈ డ్రెస్ వేసుకుంటే జ్యువెలరీ ఖర్చు కూడా ఉండదన్నారు.

అయితే ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పూజా వేసుకున్న ఈ డ్రెస్ రేటు అక్షరాలా రూ.లక్ష పదిహేను వేలు. చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఇది నిజం. ఈ డ్రెస్ ఖరీదు లక్ష రూపాయలకు పైగానే. పర్ఫెక్ట్ డిజైన్ తో తయారైన ఈ డ్రెస్ ను ధరిస్తే అదనంగా జ్యూవెలరీని ధరించాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు. ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా ఈ డ్రెస్ లో చూడటానికి అందంగా కనిపించడం సాధ్యమవుతుంది.

మరోవైపు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా పూజ సినిమాలతో బిజీగా ఉన్న తెలిసిందే. తెలుగులో పూజా హెగ్డే నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయినప్పటికీ పూజా హెగ్డేకు ప్రేక్షకులలో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తెలుగులో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో మూవీలో ఈ నటి నటిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలతో పాటు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.

First published:

Tags: Cannes Film Festival, Pooja Hegde

ఉత్తమ కథలు