HOME »NEWS »MOVIE »pooja hegde do you know what pooja hegde did with her first earnings here are the details ta

Pooja Hegde: పూజా హెగ్డే తన తొలి సంపాదనతో ఏం చేసిందో తెలుసా..

Pooja Hegde: పూజా హెగ్డే తన తొలి సంపాదనతో ఏం చేసిందో తెలుసా..
పూజా హెగ్డే (Image; Instagram)

Pooja Hegde: పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో కూడా సత్తా చూపెడుతోంది.ఈమె తన తొలి సంపాదనతో ఏం చేసిందో తెలిస్తే.. ఒకింత ఆశ్యర్యానికి గురవుతారు. 

  • Share this:
    Pooja Hegde: పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో కూడా సత్తా చూపెడుతోంది.ఈమె తన తొలి సంపాదనతో ఏం చేసిందో తెలిస్తే.. ఒకింత ఆశ్యర్యానికి గురవుతారు.  అంతేకాదు టాలీవుడ్‌లో అగ్ర  కథానాయకగా అందరి హీరోల ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. ఈమె ఓ వైపు షూటింగ్స్‌తో బిజీగా ఉంటూనే.. తనకు సంబంధించిన ఫ్యాషన్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఎప్పటి కప్పడు తన సినిమాలతో పాటు పర్సనల్ విషయాలను పంచుకుంటూ ఉంటుంది.  ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ.. ప్రభాస్‌తో రాధేశ్యామ్‌లో నటిస్తోంది. ఈ  సినిమాను బాహుబలి సినిమా విడుదలైన ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు పూజా హెగ్డే..  అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఇపుడు సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దీవాళీ’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది.మరోవైపు పూజా హెగ్గే మరో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీకి సైన్ చేసినట్టు సమాచారం.

    ఆ సంగతి పక్కన పెడితే.. పూజా హెగ్డే.. సినిమాల్లో రాకముందు నుంచి వాళ్ల అమ్మ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనే విషయంలో పూజాకు కొన్ని పాఠాలు కూడా నేర్పింది.  అందుకే పూజా హెగ్డే.. తన సంపాదించిన సంపాదనను కూడా అమ్మ చేతిలోనే పెట్టేది. కానీ తొలిసారి తనకు వచ్చిన తొలి సంపాదన నుంచి పూజా హెగ్డే BMW5 సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. ఇప్పటికే ఈ కారు పూజా హెగ్డే దగ్గర ఉంది. తొలిసారి తన సంపాదనతో కొన్ని ఆ కారు అంటే పూజాకు ప్రాణం అట. ఆ కారును పూజా హెగ్డే ఎంతో అపురూపంగా చూసుకుంటుందట.



    Pooja Hegde news, Pooja hegde to act with tamil super star vijay, dileep nelson,Pooja Hegde films,Pooja Hegde new films,Pooja Hegde with hanu,Pooja Hegde with hanu raghavapudi, pooja hegde twitter,pooja hegde instagram,pooja hegde facebook,ala vaikuntapuram,ala vaikunthapuramulo teaser,ala vaikunthapurramuloo songs,ala vaikuntapuramlo,ala vaikunthapurramuloo teaser,ala vaikunthapurramuloo trailer,ala vaikuntapuram lo,ala vaikuntapuramulo,ala vaikunta puram lo teaser,ala vaikunta puram lo,ala vaikunthapuramulo movie,ala vaikuntapuram lo songs,ala vaikunta puram lo songs,ala vaikunta puram,పూజా హెగ్డే, పూజా హెగ్డే అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో పూజా హెగ్డే,అల్లు అర్జున్ పూజా హెగ్డే
    పూజా హెగ్డే Photo : Instagram


    పూజా హెగ్డే తెలుగు విషయానికొస్తే..  నాగ చైతన్య హీరోగా నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పరిచమైంది. అంతకు ముందు ఈమె తమిళంలో జీవా హీరోగా నటించిన ‘మూగముడి’లో నటిచింది.  ఆ తర్వాత పూజా హెగ్డే..  వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మగా మురిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో పలకరించింది.ఆ సినిమా సక్సెస్ కాకపోవడంత హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో పూజా  తన  గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఆ తరవాత వెనుదిరిగి చూసుకోలేదు.

    పూజా హెగ్డే ఫోటోషూట్ (Pooja Hegde photos/instagram)


    ఆ తర్వాత ‘రంగస్థలం’లో ఐటెం భామగా పలకరించింది. ఆపై  ‘సాక్ష్యం’  సినిమాలో బెల్లంకొండతో ఆడిపాడింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’లో అరవిందగా టైటిల్‌లో రోల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘మహర్షి’, ఆపై త్రివిక్రమ్ , అల్లు అర్జున్‌తో రెండోసారి ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో హాట్రిక్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్‌గా తన సత్తా చూపెడుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:January 21, 2021, 18:14 IST