పలు దక్షిణాది భాషలు, బాలీవుడ్ తెరపై వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది పూజా హెగ్డే (Pooja Hegde). ఒక లైలా కోసం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసి నేటితరం స్టార్ హీరోలకు సరైన జోడీ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. పలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అనే క్రేజ్ కొట్టేసింది. దీంతో అమ్మడి క్రేజ్ అమాంతం రెట్టింపవుతూ వస్తోంది. జయాపజయాల సంగతి పక్కనబెడితే కెమెరా ముందు పూజా అందం, అభినయం ప్రేక్షక లోకాన్ని ఫిదా చేస్తోంది. ఈ నేపథ్యంలో దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే కోణంలో రెమ్మ్యూనరేషన్ (Pooja Hegde Remuneration) పరంగా తగ్గేదే లే అంటోందట పూజా హెగ్డే. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది.
రాకింగ్ స్టార్ యష్ (Yash) కేజీఎఫ్ (KGF) సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన నర్తన్ అనే దర్శకుడితో యష్ తన తదుపరి సినిమా చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ముప్తీ' సూపర్ హిట్‌గా నిలవడంతో ఈ కాంబోపై జనాల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని యష్ స్వయంగా నిర్మించబోతున్నారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఫైనల్ చేశారని సమాచారం. అయితే ఈ సినిమాలో నటించడానికి పూజా బాగా డిమాండ్ చేస్తుందనేది లేటెస్ట్ టాక్.
ఇప్పటికే ఆమెతో సంప్రదింపుల కార్యక్రమం పూర్తి కాగా పాన్ ఇండియా స్టార్ యష్ సరసన నటించే అవకాశం కావడంతో పూజా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ రెమ్మ్యూనరేషన్ దగ్గర తిరకాసు పెడుతోందట. తన డేట్స్ కావాలంటే అడిగినంత ఇస్తేనే ఓకే లేదంటే నో అని నిర్మొహమాటంగా చెబుతోందట. తాజాగా అందుతున్న సమాచారం మేరకు యష్ సినిమాలో నటించేందుకు గాను 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట పూజా. అయితే ఈ కథకు ఆమెనే బెస్ట్ అని భావించిన దర్శకనిర్మాతలు అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారని టాక్.
ఇకపోతే ఇటీవలే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా రూపొందుతున్న 'జనగణమన' (Janaganama) మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పూజా హెగ్డే. హిందీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన 'కభీ ఈద్ కభీ దీవాళీ' (Kabhi Eid Kabhi Diwali) అనే సినిమా షూటింగ్‌లోనూ మరికొద్ది రోజుల్లో జాయిన్ కాబోతోంది పూజా. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్ కూడా నటిస్తుండగా పూజా రోల్ కీలకం కానుందట. మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందనున్న సినిమాలోనూ పూజా హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Pooja hegde remunaration, Yash