Pooja Hegde : కాలు జారితే తీసుకోవచ్చు కానీ.. నోరు జారితే అంత ఈజీగా తీసుకోలేము. తాజాగా పూజా హెగ్డే దక్షిణాది ప్రేక్షకులపై చేసిన కామెంట్స్ ఇపుడు ఆమెను ఇరకాటంలో పడేసాయి. పైగా ఈమె ఏదో నార్త్ నుంచి ఊడిపడ్డ భామ కూడా కాదు. ఆమె స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు. ఇంతకీ ఈ భామ ఏమన్నదంటే.. తాజాగా ఈ భామ.. సౌత్ ప్రేక్షకులు హీరోయిన్స్ నాభి అందాలు తప్పిస్తే.. వేరే ఏవి అక్కర్లేదంటూ చేసిన కామెంట్స్ పై పూజా హెగ్డే పై నెటిజన్స్ మండిపడుతున్నారు. నార్త్‌లో ఈ భామ చేసిన రెండు సినిమాల్లోనే ఎక్కువగా గ్లామర్ ఉంది. ఫస్ట్ మూవీ ‘ఒక లైలా కోసం’, ఆ తర్వాత చేసిన ‘ముకుందా’ సినిమాల్లో సాంప్రదాయ బద్ధంగా కనిపించింది. అలాంటిది దక్షిణాది ఇండస్ట్రీ ప్రేక్షకులను చులకన చేసేలా మాట్లాడంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. అంతేకాదు.. హీరోయిన్‌గా పూజాకు సినీ జీవితా్ని ప్రసాదించిన టాలీవుడ్‌లో కృతజ్ఞత లేకుండా మాట్లాడంపై తగదని పలువురు సినీ పెద్దలతో పాటు నెటిజన్లు ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడంతో వెంటనే తేరుకున్న పూజా హెగ్డే.. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కాళ్ల బేరానికి వచ్చింది.
తాను ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కొంత మంది తప్పుగా ప్రచారం చేసారని చెప్పుకొచ్చింది. అక్షరాన్ని మార్చగలరేమో కానీ.. సౌత్ ఇండస్ట్రీపై తనకు గల అభిప్రాయాన్ని మార్చలేరంటూ వివరణ ఇచ్చింది. పూజా హెగ్డే వరుసగా ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో హాట్రిక్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు అఖిల్ హీరోగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Most Eligible Bachelor, Pooja Hegde, Radhe Shyam, Sandalwood, Tollywood