హోమ్ /వార్తలు /సినిమా /

Pooja Hegde : సల్మాన్ ఖాన్ అలాంటి వ్యక్తి కాదు.. ఆయన వ్యక్తిత్వం ఇష్టం.. పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు..

Pooja Hegde : సల్మాన్ ఖాన్ అలాంటి వ్యక్తి కాదు.. ఆయన వ్యక్తిత్వం ఇష్టం.. పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు..

Pooja hegde Photo : Instagram

Pooja hegde Photo : Instagram

Pooja Hegde : తెలుగు హీరోయిన్ పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  తెలుగు హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకపరిచయం చేయాల్సిన పనిలేదు. నటన సంగతి అలా ఉంచితే తన అందచందాలతో తెలుగులో బాగానే రాణిస్తోంది. వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇది అలా ఉంటే పూజా తాజాగా హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. లోపల ఒకలా, పైకి మరోలా కనిపించే వ్యక్తిత్వం కాదు సల్మాన్‌ఖాన్‌ది అంటూ పేర్కోన్నారు పూజాహెగ్డే. కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిత్వాలకు ముసుగు వేసుకుంటారు. కానీ సల్మాన్‌ఖాన్‌ది అలాంటి మనసత్వం కాదు. తనకు నచ్చితే నచ్చినట్టుగా ఉంటాడు. నచ్చకుంటే నచ్చనట్టు ఉంటాడు. అలాంటి వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం.. ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారో అనే సంశయాలు లేకుండా నిజాయితీగా, ముక్కుసూటిగా తమకు నచ్చినట్టు ఉండగలగడం చాలా గ్రేట్‌ అంటూ సల్మాన్‌ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.. పూజా హెగ్డే.

  ఇక సల్మాన్‌ఖాన్‌తో కలసి పూజా హెగ్డే 'భైజాన్‌' అనే చిత్రంలో నటిస్తోంది పూజా. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక ఈ భామ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. పూజాహెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. ఈ భామ తాజాగా ఓ తమిళ సినిమాలో అవకాశం అందిపుచ్చుకుంది. విజయ్ సరసన బీస్ట్ అనే సినిమాను చేస్తోంది. అయితే ఈ సినిమాకి ఆమె తీసుకుంటున్న పారితోషికం ఫిగర్ తెలిసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. పూజా హెగ్డే 2012లో ‘ముగమూడి’ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసింది. అయితే పూజాహెగ్డేకు ఆ సినిమా పెద్దగా గుర్తింపును ఇవ్వలేదు. మళ్లీ 8 ఏళ్ల తర్వాత తమిళంలోకి ప్రవేశించడానికి ఆమెకు అవకాశం వచ్చింది. విజయ్ తన 65వ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాలో పూజ హెగ్డే నటించడానికి దాదాపు 3.5 కోట్లు డిమాండ్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.


  ఇక పూజా హెగ్డే తెలుగు సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అలవైకుంఠపురములో నటించి భారీ విజయాన్ని అందుకుంది. పూజా హెగ్డే ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో వస్తోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చేస్తోంది. పిరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ రాధే శ్యామ్ ను రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. రాధేశ్యామ్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషాల్లో విడుదలకానుంది. చిరంజీవి ఆచార్యలో కూడా పూజాహెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. పూజాహెగ్డే తెలుగుతో పాటు హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ చేస్తోంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Pooja Hegde, Pooja hegde remunaration

  ఉత్తమ కథలు