హోమ్ /వార్తలు /సినిమా /

Pooja Hegde: కొత్త ఇల్లు కొనుక్కున్న పూజా హెగ్డే... అల్లు అర్జున్ చెప్పిందే జరగనుందా ?

Pooja Hegde: కొత్త ఇల్లు కొనుక్కున్న పూజా హెగ్డే... అల్లు అర్జున్ చెప్పిందే జరగనుందా ?

Pooja Hegde New House: పూజా హెగ్డే ముంబైలో ఇల్లు కొనుక్కోవడం ఫ్యాన్స్‌కు ఆనందం కలిగిస్తున్నా.. అసలు ముంబైలో ఆమె ఎందుకు ఇల్లు కొనుక్కుందనే విషయం మాత్రం కొందరిని కలవరపెడుతోంది. ఇందుకు ప్రధాన కారణం.. గత నెల ఓ ఈవెంట్‌లో పూజా హెగ్డేపై అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలే.

ఇంకా చదవండి ...

  టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో సొంత ఫ్లాట్ కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాంద్రాలో ఖరీదైన మూడు బెడ్రూమ్‌లున్న కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది పూజా. ఈ ఫ్లాట్ సముద్రానికి ఎదురుగా ఉండటం మరో విశేషం. పూజా హెగ్డే తన సొంత డబ్బులతో కొనుగోలు చేసిన ఫస్ట్ ఫ్లాట్ ఇదేనని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ముంబైలో ఉన్న ఈ కొత్త ఇంటికి సంబంధించిన ఇంటీరిల్ డిజైన్ ను పూజా హెగ్డే దగ్గరుండి మరీ సెలెక్ట్ చేసింది. రీసెంట్‌గా ఇందులో పూజా హెగ్గే గృహ ప్రవేశం కూడా చేసింది. ఈ ఫ్లాట్ ముంబై ఎయిర్‌పోర్ట్‌ దగ్గరగా ఉంది. ముంబైలో తీసుకున్న ఫ్లాట్‌లో ఓ చైర్‌లో కూర్చొని కునుకు తీస్తున్నట్టు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  పూజా హెగ్డే ముంబైలో ఇల్లు కొనుక్కోవడం ఫ్యాన్స్‌కు ఆనందం కలిగిస్తున్నా.. అసలు ముంబైలో ఆమె ఎందుకు ఇల్లు కొనుక్కుందనే విషయం మాత్రం కొందరిని కలవరపెడుతోంది. ఇందుకు ప్రధాన కారణం.. గత నెల ఓ ఈవెంట్‌లో పూజా హెగ్డేపై అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలే. అల వైకుంఠపురము విడుదలైన ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సినిమా హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు.. పూజా హెగ్డే గురించి కొత్త చర్చకు తెరలేపాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బన్నీ.. పూజా హెగ్డేతో హ్యాట్రిక్ మూవీ చేయాలని ఉందని అన్నాడు. అది కూడా తాను టాలీవుడ్‌లో సినిమా చేస్తేనే అని కామెంట్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ ఎందుకు అలా అన్నాడనే దానిపై చర్చ మొదలైంది.

  పూజా హెగ్డేకు ఇప్పుడప్పుడే మళ్లీ తెలుగులో కొత్త సినిమాలకు సైన్ చేయాలనే ఆలోచన లేదేమో అని.. అందుకే అల్లు అర్జున్ అని ఉంటాడనే గుసగుసలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌లో ఒక్క హిట్ వచ్చినా.. మళ్లీ టాలీవుడ్ వైపు చూడకుండా కియారా అద్వానీ తరహాలోనే ముంబైకు పరిమితం కావాలని పూజా ప్లాన్ చేసుకుంటోందని... ఆమె ప్లాన్స్ తెలియడం వల్లే అల్లు అర్జున్ ఆ మాట అన్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా పూజా హెగ్డే ముంబైలో ఇల్లు కొనుక్కోవడంతో.. అల్లు అర్జున్ మాటలే నిజమవుతాయేమో అనే టాక్ మరోసారి మొదలైంది.

  First published:

  Tags: Pooja Hegde

  ఉత్తమ కథలు