Pooja Hegde: పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బిజీ హీరోయిన్. అంతేకాదు ఇపుడిపుడే బాలీవుడ్‌లో కూడా సత్తా చూపెడుతోంది ఈ భామ. తాజాగా ఈ భామ ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో సొంత ఫ్లాట్ తీసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఇంట్లో ఫర్నిచర్‌తో పాటు తన టేస్ట్‌కు తగ్గట్టు పలు మార్పులు చేయిస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది బుట్టబొమ్మ. పూజా హెగ్డే విషయానికొస్తే.. సౌత్ నుంచి నార్త్ వరకు అందరు హీరోలు పూజా హెగ్డే డేట్స్ కోసం కళ్లు కాయలు ఎదురు చూస్తున్నారు. అంతేకాదు పూజా హెగ్డే టాప్ హీరోల ఫస్ట్ ఛాయిస్‌గా మారింది.
ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా అన్ని ఇండస్ట్రీలను దున్నేస్తోంది. రీసెంట్‌గా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తో మరో హిట్టును తన అకౌంట్‌లో వేసుకుంది. తన లెగ్‌తో వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్‌కు తొలి హిట్టును అందించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో బిజీగా ఉన్న పూజా హెగ్డే.. ముంబై వెళ్లినపుడు ఖరీదైన హోటల్‌లో స్టే చేస్తోంది. దీంతో నిర్మాతలతో పాటు పూజా హెగ్డేకు బిల్లు తడిసి మోపెడు అవుతోంది.
View this post on Instagram
అందుకే ముంబై వెళ్తే అక్కడ ఉండేలా బాంద్రాలో ఖరీదైన మూడు బెడ్రూమ్‌లున్న కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ సముద్రానికి ఎదురుగా ఉంది. పూజా హెగ్డే తన సొంత డబ్బులతో కొనుగోలు చేసిన ఫస్ట్ ఫ్లాట్ ఇదే. అంతేకాదు ముంబైలో ఉన్న ఈ కొత్త ఇంటికి సంబంధించిన ఇంటీరిల్ డిజైన్ ను పూజా హెగ్డే దగ్గరుండి మరీ సెలెక్ట్ చేసింది. రీసెంట్‌గా ఇందులో పూజా హెగ్గే గృహ ప్రవేశం కూడా చేసింది. పైగా ముంబై ఎయిర్‌పోర్ట్ దగ్గరగా ఉంది. ప్రస్తుతం ఈ ఇంటిలో కొన్ని మార్పులు చేర్పులు తన తల్లితో కలిసి చేయిస్తోంది పూజా హెగ్డే.
Rajinikanth : రాష్ట్రపతి, ప్రధానితో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రజినీకాంత్ మర్యాద పూర్వక భేటి..
అక్కడ నుంచి తన సొంతూరు బెంగళూరుతో పాటు హైదరాబాద్ వెళ్లడానికి ఈ ప్లేస్ అనువుగా ఉండటంతో పూజా హెగ్డే.. బాంద్రాలో ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం.ప్రస్తుతం పూజా హెగ్డేను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో 15.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ.. ప్రభాస్‌తో రాధేశ్యామ్‌లో నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇప్పటికే ప్రేరణగా విడుదలైన పూజా హెగ్డే లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Chiranjeevi : చిరంజీవి మరో సంచలన నిర్ణయం.. ఫామ్‌లో లేని ఒకప్పటి అగ్ర దర్శకుడికి మెగాస్టార్ ఛాన్స్..?
మరోవైపు చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇంకోవైపు బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సర్కస్’లో నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya, Most Eligible Bachelor, Pooja Hegde, Radhe Shyam, Tollywood