• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • POOJA HEGDE AFTER NOON NAP PHOTO GOES VIRAL DURING SHOOTING GAP TA

Pooja Hegde: షూటింగ్ గ్యాప్‌లో అలా సేద తీరుతున్న పూజా హెగ్డే.. సోషల్ మీడియాలో బుట్ట బొమ్మ పిక్ వైరల్...

కుర్చీలో సేద తీరుతున్న పూజా హెగ్డే (Instagram/Photo)

Pooja Hegde: పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోయిన్. అంతేకాదు ఇపుడిపుడే బాలీవుడ్‌లో కూడా సత్తా చూపెడుతోంది ఈ భామ.

  • Share this:
    Pooja Hegde: పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోయిన్. అంతేకాదు ఇపుడిపుడే బాలీవుడ్‌లో కూడా సత్తా చూపెడుతోంది ఈ భామ. అంతేకాదు సౌత్ నుంచి నార్త వరకు  అందరు హీరోలు పూజా హెగ్డే డేట్స్ కోసం కళ్లు కాయలు ఎదురు చూస్తున్నారు. అంతేకాదు పూజా హెగ్డే టాప్ హీరోలు తమ ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లను చుట్టేస్తోంది. ఈ గ్యాప్‌లో ఈ అమ్మడికి నిద్ర కరువు అయినట్టు కనిపిస్తోంది. అందుకే షూటింగ్ లేకుండా గ్యాప్ దొరికితే.. కాస్త కునుకు తీస్తోంది. తాజాగా పూజా హెగ్డే తన ఇంట్లో ఓ చైర్‌లో మధ్యాహ్నం కాసేపు అలా సేద తీరుతూ రిలాక్స్ అవుతోంది.

    దానికి సంబంధించిన ఫోటోను పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటకు ఇప్పటి వరకు 6 లక్షల 28 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.ప్రస్తుతం పూజా హెగ్డేను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో 12.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ.. ప్రభాస్‌తో రాధేశ్యామ్‌లో నటిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాను జూలై 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.








    View this post on Instagram






    A post shared by Pooja Hegde (@hegdepooja)






    మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది పూజా హెగ్డే. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేస్తున్నారు. ఈ రకంగా పూజా హెగ్డే నటిస్తోన్న రెండు సినిమాలు నెలన్నర గ్యాప్‌లో విడుదల కానున్నాయి.

    ppoja hegde, aacharya, ram charn in aacharya, chiranjeevi, koratala siva, pooja hegde in aacharya, cirkus, radhe shyam, most eligible bachelor, పూజా హెగ్డే, ఆచార్య, రాధేశ్యామ్
    Mega Power star Ram Charan enters into field for Pooja Hegde In Aacharya


    మరోవైపు పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇంకోవైపు బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సర్కస్’లో నటిస్తోంది. వాటితో పాటు చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ‘ఆచార్య’లో నటిస్తోంది పూజా హెగ్డే. మొత్తంగా ఈ యేడాది పూజా హెగ్డే ముచ్చటగా మూడు సినిమాలతో అభిమానులను పలకరించనుందన్నమాట.

    prabhas, pooja hegde, radhe shyam, prabhas radhe shyam, pooja hegde about radhe shyam, pooja hegde shared a picture, radhe shyam latest update, prabhas movie latest update, ప్రభాస్, రాధేశ్యామ్, పూజా హెగ్డే
    Pooja Hegde wants to start that with Prabhas but what was she talking about


    పూజా హెగ్డే తెలుగులో..  నాగ చైతన్య హీరోగా నాగార్జున నిర్మించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పరిచమైంది. అంతకు ముందు ఈమె తమిళంలో జీవా హీరోగా నటించిన ‘మూగముడి’లో నటిచింది.  ఆ తర్వాత పూజా హెగ్డే..  వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మగా మురిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో పలకరించింది.ఆ సినిమా సక్సెస్ కాకపోవడంత హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో పూజా  తన  గ్లామర్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ఆ తరవాత వెనుదిరిగి చూసుకోలేదు.

    పూజా హెగ్డే ఫోటోషూట్ (Pooja Hegde photos/instagram)


    ఆ తర్వాత ‘రంగస్థలం’లో ఐటెం భామగా పలకరించింది. ఆపై  ‘సాక్ష్యం’  సినిమాలో బెల్లంకొండతో ఆడిపాడింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’లో అరవిందగా టైటిల్‌లో రోల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘మహర్షి’, ఆపై త్రివిక్రమ్ , అల్లు అర్జున్‌తో రెండోసారి ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో హాట్రిక్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్‌గా తన సత్తా చూపెడుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: