హోమ్ /వార్తలు /సినిమా /

Ponniyin Selvan 2 : పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ విడుదల.. అదిరిన రెస్పాన్స్..

Ponniyin Selvan 2 : పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ విడుదల.. అదిరిన రెస్పాన్స్..

PS2 Trailer Photo : Twitter

PS2 Trailer Photo : Twitter

Ponniyin Selvan 2 | ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan - 1). ఈ సినిమా మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలై తమిళ్‌లో మంచి వసూళ్లను రాబట్టింది. ఇక రెండో పార్ట్ ఏప్రిల్ 28న విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడులైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan 1) ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. సెప్టెంబర్ 30 2022న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో విక్రమ్ (Vikran) .. కార్తి (Karthi) .. జయం రవి (Jayam Ravi) .. శరత్ కుమార్ .. పార్తీబన్ .. ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) .. త్రిష (Trisha).. ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఏఆర్ రెహ్మాన్  (AR Rahman)గీతాన్ని సమకూర్చారు.. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేశారు. ఒక్క తమిళ్‌లో తప్ప మిగితా ప్రాంతాల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా రెండో పార్ట్‌కు సంబంధించిన విడుదల తేదిని చిత్రబృదం ప్రకటించింది. ఈ చిత్రాన్ని 2023, ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మార్చి 29న జరిగింది. ఈ వేడుకకు విశ్వనటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా వచ్చారు.

ఇక ట్రైలర్ (Ponniyin Selvan 2 Trailer ) విషయానికి వస్తే.. విజువల్స్ అదిరాయి. భారీ యక్షన్‌తో పాటు గ్రాండియర్ విజువల్స్ నెటిజన్స్‌ను ఆకట్టుకున్నాయి. అరుణ్‌మొళి మరణించారనే వార్తతో చోళ రాజ్యంలో అధికారం కోసం యుద్ధం ప్రారంభమవుతుంది. మరోవైపు నందినీ, కరికాలన్‌తో పాటు మొత్తం చోళ రాజ్యాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తారు. ఇక చోళ రాజ్యంలో చిరవకు అధికారం ఎవరు దక్కించుకున్నారు, ఎవరు రాజు అయ్యారు అనేది సినిమాలో చూడాల్సి ఉంది. అరుణ్‌మొళిగా జయం రవి, ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్, కుందవైగా త్రిష, సుందర చోళన్‌గా ప్రకాష్ రాజ్ , నందినిగా ఐశ్వర్యరాయ్ చేస్తున్నారు. చూడాలి మరి ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఆకట్టుకోనుందో.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను మరోసారి దిల్ రాజు విడుదల చేయనున్నారు.

ఇక మరో వైపు ఈ సినిమా రన్ టైమ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా రన్ టైమ్ విత్ అవుట్ కట్ నాలుగు గంటలు వచ్చిందట. ఇక థియేట్రికల్ రన్ టైమ్ మూడు గంటల 53 నిమిషాల రన్ టైమ్ వచ్చిందట. దీంతో ఈ రైన్ టైమ్‌ కనుక నిజమైమే నాన్ తమిళయన్స్‌కు రక్త కన్నీరే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

ఇక ఈ సినిమా మొదటి భాగం ఇటీవల టీవీలో ప్రసారం అయ్యింది. జెమినీలో టెలివిజన్ ప్రీమియర్‌గా ఆదివారం ప్రసారం అయ్యిన ఈ సినిమాకు తెలుగులో డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్‌లోనే కాదు టీవీలోను ఈ సినిమా పట్ల తెలుగు వారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేదు. ఈ సినిమాకు 2.17 రేటింగ్ వచ్చింది. ఓ పెద్ద ప్యాన్ ఇండియా సినిమాకు, అది మల్టీ స్టార్రర్ సినిమాకు మరీ ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడం ఏంటీ అని షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఇక పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం విషయానికి వస్తే..  బాక్స్ ఆఫీస్ దగ్గర మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 1 మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన.. మిగితా చోట్ల మాత్రం దుమ్ము లేపింది. ముఖ్యంగా తమిళనాడులో అదరగొట్టింది. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాaను తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించింది.

First published:

Tags: Ponniyin Selvan -2, Tollywood news

ఉత్తమ కథలు