మహేష్ బాబు, పరశురామ్ సినిమాకు షాకిచ్చిన పోలీసులు..

Mahesh Babu: సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమా తర్వాత మరోసారి కుర్ర దర్శకుడినే నమ్ముకుంటున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఈయన పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 28, 2020, 4:47 PM IST
మహేష్ బాబు, పరశురామ్ సినిమాకు షాకిచ్చిన పోలీసులు..
మహేష్ పరశురామ్ (mahesh babu parasuram)
  • Share this:
సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమా తర్వాత మరోసారి కుర్ర దర్శకుడినే నమ్ముకుంటున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఈయన పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ఓపెనింగ్ మే 31న జరగనుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. కరోనా నేఫథ్యంలో చాలా తక్కువ మందితోనే ఈ ఓపెనింగ్ చేయాలని దర్శక నిర్మాతలు కూడా ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం మహేష్ బాబు సినిమాకు షాక్ ఇచ్చారు. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను మే 31న ఘనంగా లాంఛ్ చేయాలనుకుంటే ఇప్పుడు పోలీసుల నుంచి అనుమతి రాలేదని తెలుస్తుంది.
మహేష్ పరశురామ్ (mahesh babu parasuram)
మహేష్ పరశురామ్ (mahesh babu parasuram)


దాంతో ఈ ప్లాన్ వెనక్కి తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఓపెనింగ్ లేకపోయినా కూడా అధికారికంగా ఆ రోజు ట్విట్టర్‌లో ఓ టైటిల్ లోగో విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. అందులోనే సినిమాకు పని చేస్తున్న సాంకేతిక నిపుణుల జాబితాను కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించబోతున్నాడు. వరసగా మూడు సినిమాలు దేవీ శ్రీ ప్రసాద్‌తోనే చేసిన మహేష్.. చాలా రోజుల తర్వాత మళ్లీ తమన్ వైపు వచ్చాడు.
మహేష్ పరశురామ్ (mahesh babu parasuram)
మహేష్ పరశురామ్ (mahesh babu parasuram)

ఇక పరశురామ్ ఇదివరకే తమన్‌తో పని చేసాడు. ఈ సినిమాను పక్కా కమర్షియల్ కథతోనే తెరకెక్కిస్తున్నాడు పరశురామ్. మహేష్ బాబు ఇమేజ్‌కు సరిపోయేలా ఓ కమర్షియల్ కథను సిద్ధం చేసాడు. ఆర్థిక నేరాల నేపథ్యంలో సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది. అందుకే దీనికి సర్కార్ వారి పాట అనే టైటిల్ అనుకుంటున్నాడు దర్శకుడు పరశురామ్. కచ్చితంగా ఈ చిత్రంతో మహేష్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు అభిమానులు. మరి వాళ్ల నమ్మకాన్ని పరశురామ్ ఎంత వరకు నిలబెడతాడో చూడాలిక.
First published: May 28, 2020, 4:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading