హోమ్ /వార్తలు /సినిమా /

Inti Guttu: పెళ్ళాం లేచిపోవడంతో మైనర్ అమ్మాయికి తాళి కట్టిన పోలీస్ ఆఫీసర్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

Inti Guttu: పెళ్ళాం లేచిపోవడంతో మైనర్ అమ్మాయికి తాళి కట్టిన పోలీస్ ఆఫీసర్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

inti guttu serial

inti guttu serial

Inti Guttu: ఇంటి గుట్టు.. మీనా వాసు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సీరియల్ జీ తెలుగులో ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ మైనర్ అమ్మాయ్ చుట్టూ తిరగడంతో మంచి క్రేజ్ ఏర్పడింది

  Inti Guttu: ఇంటి గుట్టు.. మీనా వాసు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సీరియల్ జీ తెలుగులో ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ మైనర్ అమ్మాయ్ చుట్టూ తిరగడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. మైనర్ అమ్మాయ్ బాలికలో నిషా గౌడ్ ఎంతో అద్భుతంగా నటిస్తూ తన పాత్రకు మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ చలాకి పిల్లా. ఇక ఈ నేపథ్యంలోనే ఇంటి గుట్టు సీరియల్ లో ఇటీవల ఓ అనుకోని ఘటన జరగడంతో సోషల్ మీడియాలో ఈ ఘటనపై నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తున్నారు సీరియల్ అభిమానులు.

  ఈ సీరియల్ లో పోలీస్ ఆఫీసర్ భార్య అయిన సంపద.. సిద్ధూ అనే వ్యక్తిని పెళ్ళికి ముందే ప్రేమించింది. అతను పోలీస్ ఆఫీసర్ బంధువే కావడంతో వాళ్ళ ఇంట్లోనే తిష్ట వేసి సంపద అతను పారిపోయే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలోనే తల్లిని పోగొట్టుకున్న హీరోయిన్ కళ్యాణి పాత్ర ఆ ఇంటికి వచ్చి చేరడం.. సిద్దు గురించి నిజం తెలియని ఇంట్లో వాళ్ళు కళ్యాణితో సిద్ధూ పెళ్లి చెయ్యాలి అనుకుంటారు. ఆ సమయంలోనే గర్భవతిగా ఉన్న సంపద పిల్లాడిని కనేసి.. పెళ్లిపీటలపై ఉండాల్సిన పెళ్ళి కొడుకు సిద్ధుతో లేచిపోతుంది.

  inti guttu serial
  inti guttu serial

  ఇంకా ఈ సీరియల్ లో పెద్ద విలన్ అయిన దమయంతి అలియాస్ సంపద అత్త.. కోడలు లేచిపోయిందని తెలిస్తే పరువు పోతుందని.. కళ్యాణినే సిద్ధూతో సంపదను దగ్గరుండి పంపించినట్టు ఇంట్లోవాళ్ళకి చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ కోపంతో ఆమె కొడుకును చూసే వాళ్ళు లేరని కళ్యాణికి శిక్ష పడాలంటూ మైనర్ అమ్మాయ్ అయిన కళ్యాణికి తాళి కడుతాడు.. పెళ్లి చేసుకొని జీవితాంతం చిత్రహింసలు పెడుతా అంటూ పోలీస్ ఆఫీసర్ డైలాగులు ఒకటి. దీంతో ఈ సీరియల్ అభిమానులు పోలీస్ ఆఫీసర్ అయి ఉండి మైనర్ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. రెండు పెళ్లిళ్ళా ఘటనలు చూపించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటూ నిలదీస్తున్నారు కూడా. మరి ఈ సీరియల్ లో భవిష్యేత్తులో ఏలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Inti guttu serial, Meena vasu, Star maa serials, Telugu serials, Zee telugu

  ఉత్తమ కథలు