Suriya : తమిళ స్టార్ హీరో సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయాలు అక్కర లేదు. మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ‘గజని’తో తెలుగు వారి హృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇక కరోనా కాలంలో సూర్య నటించిన (Soorarai Pottru) 'సూరారై పొట్రు'. ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా... పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కరోనా కారణంగా ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.
అంతేకాదు 'ఆస్కార్' రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంటోంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అంతేకాదు కొన్నేళ్లుగా ఫ్లాప్‌లతో డీలా పడ్డ సూర్యకు ఈ చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.తాజాగా ఈయనపై తమిళనాడుకు చెందిన వేళచ్చేరి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జై భీమ్ చిత్ర వ్యవహారంలో ఒకరైన జ్యోతిక,దర్శకుడు జ్ఞానవేల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు వన్నియర్ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆ సామాజిక వర్గం వాళ్లు ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా హీరో, దర్శక, నిర్మాతలపై కేసు నమోదు చేయమని అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు సూర్య సహా ఎవరిపై కేసు నమోదు చేయలేదు. దీంతో ఈయన స్థానిక సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో ఇదే విషయమై పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు హీరో సూర్య, నిర్మాత జ్యోతిక దర్శకుడు టీజే జ్ఞానవేల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్డుకు సమర్పించాలంటూ స్థానిక పోలీసులకు ఆదేశించింది. కోర్డు ఆదేశాలతో పోలీసులు హీరో సూర్య, జ్యోతికతో పాటు దర్శకుడు జ్ఞానవేల్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే ఈ వ్యవహారంలో వన్నియర్ సంఘం సూర్యపై రూ. 5 కోట్ల పరువు నష్టం దాఖలు చేశారు. ఆయన బేషరుతుగా క్షమాపణ కోరితే.. పరువు నష్టం ఉపసంహరించుకుంటామని చెప్పారు.
సూర్య విషయానికొస్తే.. ఒకపుడు వరుస హిట్స్‌తో సూర్యకు తెలుగులో మంచి మార్కెటే ఉండేది. రాను రాను ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఇపుడు ఆ రేంజ్ మార్కెట్ టాలీవుడ్లో లేదనే చెప్పాలి. ఈయన గత సినిమాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమా ఓటీటీ వేదికగా సూపర్ హిట్స్‌గా నిలిచాయి. తెలుగులో ఆయా సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా యేళ్ల తర్వాత ఈయన డైరెక్ట్‌గా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ మూవీతో పలకరించారు మొత్తంగా ఈ మూవీతో సూర్య ఓ మోస్తరు విజయాన్నే అందుకున్నారనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.