Home /News /movies /

POLICE COMPLAINT RAISED AGAINST BOLLYWOOD HERO VICKY KAUSHAL AND HERE THE BEHIND STORY PK

Vicky Kaushal: మొన్నే పెళ్లైంది.. అప్పుడే పోలీస్ కంప్లైంట్.. వివాదంలో విక్కీ కౌశల్..

విక్కీ కౌశల్ (Vicky Kaushal)

విక్కీ కౌశల్ (Vicky Kaushal)

Vicky Kaushal: URI సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైన నటుడు విక్కీ కౌశల్‌ (Vicky Kaushal). నటించింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరో అయ్యాడు. ఈయనకు ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. పైగా నేషనల్ అవార్డు కూడా తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు విక్కీ.

ఇంకా చదవండి ...
ushaURI సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైన నటుడు విక్కీ కౌశల్‌. నటించింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరో అయ్యాడు. ఈయనకు ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. పైగా నేషనల్ అవార్డు కూడా తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు విక్కీ. మొన్నటికి మొన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను పెళ్లి చేసుకుని దేశం మొత్తం తన వైపు చూసేలా చేసాడు విక్కీ కౌశల్. ఈ ఇద్దరి పెళ్లి డిసెంబర్‌లో ఘనంగా జరిగింది. అయితే అంతలోనే ఈయనపై ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ నమోదైంది. ఇండోర్‌లో నివసించే జైసింగ్‌ అనే వ్యక్తి విక్కీ కౌశల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అనుమతి లేకుండా తన బైక్ నెంబర్ సినిమాలో వాడేస్తున్నారంటూ ఆయన పోలీసులను ఆశ్రయించాడు. అసలు విషయం ఏంటంటే.. విక్కీ కౌశల్‌ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో ఓ బైక్ ఉంది. దాని నెంబర్ ప్లేట్.. తన బైక్ నెంబర్ ఒకటే అని జైసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

ఈ విషయంపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. తన బైక్ నెంబర్ అలా చెప్పకుండా ఎలా వాడేస్తారు అంటున్నాడు ఈయన. అనుమతులు తీసుకోకుండా ఒక ద్విచక్రవాహన నెంబర్ వేరొకరు వాడటం చట్ట వ్యతిరేకం అంటున్నాడు జైసింగ్. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను అంటున్నాడు ఈయన. దీనిపై తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పాడు జైసింగ్‌ యాదవ్‌. మరోవైపు ఈ విషయంపై పోలీస్‌ అధికారి స్పందిస్తూ.. ఫిర్యాదు అందిన మాట నిజమే అని చెప్పాడు.

RRR movie: ఆ చెత్త రికార్డు మాత్రం ‘ట్రిపుల్ ఆర్’ ఖాతాలోనే.. పాపం ఎవరు మాత్రం చేస్తారు..?


అంతేకాదు.. సినిమా బృందం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే మోటర్‌ సైకిల్‌ యాక్ట్‌ కింద వాళ్లపై చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. విక్కీ కౌశల్‌, సారా అలీ ఖాన్ జంటగా ప్రస్తుతం ఓ సినిమా వస్తుంది. భిన్నమైన లవ్ స్టోరీగా ఈ చిత్రం వస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇండోర్‌లో జరుగుతుంది. వీటికి సంబంధించిన షూటింగ్ ఫోటోలు వైరల్ అయ్యాయి. అక్కడే బైక్ నెంబర్ ప్లేట్ హైలైట్ అయింది. ఇవి చూసిన తర్వాతే జైసింగ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ వేడుకల కోసం ఇండోర్ నుంచి ముంబై వచ్చాడు విక్కీ. భార్య కత్రినాతో సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ కోసం ఇండోర్ వచ్చేసాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bollywood, Hindi Cinema, Vicky Kaushal

తదుపరి వార్తలు