Vakeel Saab Police Complaint: వివాదంలో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’... పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

వకీల్ సాబ్ (Vakeel Saab Collections)

Vakeel Saab: పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’. గత నెల ఏప్రిల్ 9న విడుదలైన ‘వకీల్ సాబ్’ సినిమాకు మొదటి ఆటతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాాజాగా ఈ సినిమాపై ఓ వివాదం నెలకొంది.

  • Share this:
    Vakeel Saab: పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’. గత నెల ఏప్రిల్ 9న విడుదలైన ‘వకీల్ సాబ్’ సినిమాకు మొదటి ఆటతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ బిజనెస్ అనుకున్నంత రేంజ్‌లో జరగలేదు. దీంతో ఈ సినిమా విడుదలైన మూడు వారాల్లోనే ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్  ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేసారు. అక్కడ ఈ సినిమా ఎక్కువ హిట్స్ సాధించిన తెలుగు సినిమాగా రికార్డులకు ఎక్కినట్టు అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటి వరకు 100 మిలియన్ హిట్స్ వచ్చినట్టు తెలిపారు.

    ఈ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాపై ఈ సినిమాలో ఓ సన్నివేశంలో తన ఫోన్ నెంబర్ యూజ్ చేసారంటూ సుధాకర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ అంజలి ఫోటోను మార్ఫింగ్ చేస్తూ ‘వకీల్ సాబ్’ సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది.

    పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ (Twitter/Photo)


    అందులో అంజలి ఫోటో కింద తన ఫోన్ నంబర్ ఉండటం వలన తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అసభ్యకరమైన ఫోన్లు వస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై చిత్ర యూనిట్ పై కేసు నమోదు చేయాలని ఆయ పోలీసులను కోరారు. కానీ పోలసులు ఈ  కేసు విషయమై ముందుగా విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని చెప్పినట్టు సమాచారం. మరోవైపు నిర్మాత దిల్ రాజు.. వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: