Home /News /movies /

POLICE CASE FILIED ON BOLLYWOOD STAR HERO RANVEER SINGH SLB

Ranveer Singh: చిక్కుల్లో రణ్‌వీర్‌ సింగ్‌‌.. న్యూడ్ ఫోటోషూట్‌పై పోలీస్ కేసు

Photo Credit: Twitter

Photo Credit: Twitter

Ranveer Singh Photo Shoot: ఓ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్‌ సింగ్‌‌ నగ్న ఫొటో షూట్ చేయడం రచ్చకు తెరలేపింది. తాజాగా ఆయన చిక్కుల్లో పడ్డారు. రణవీర్ సింగ్‌పై ముంబైలోని చెంబూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)‌ ఇష్యూపై జోరుగా చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఓ మ్యాగజైన్ కోసం ఆయన నగ్న ఫొటో షూట్ చేయడం రచ్చకు తెరలేపింది. అంతేకాదు వేల మంది ముందు తాను బట్టలు లేకుండా రాగలనని, తనను ఎవరు ఎంత తిట్టినా పట్టించుకోనని రణ్‌వీర్ చెప్పడం పలువురు ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఈ ఇష్యూ తీవ్ర దుమారం రేపుతోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో రణవీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. రణవీర్ సింగ్‌పై ముంబైలోని చెంబూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మరోసారి ఆయన న్యూడ్ ఫొటోస్ వ్యవహారం హాట్ ఇష్యూగా మారింది.

ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నగ్న ఫొటో షూట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు రణ్‌వీర్. అంతేకాదు ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో కూడా పోస్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. రణ్‌వీర్ ఇలా బట్టలు లేకుండా కనిపించడం కొత్తేమీ కాకపోయినా ఈ సారి దిగిన ఫొటోస్ మాత్రం రచ్చకు తెరలేపాయి. ఎంతోమంది సామజిక కార్యకర్తలు ఆయన తీరును తప్పుబడుతూ తెగ ట్రోల్ చేశారు.

ఎప్పుడు లేనంతగా తొలిసారి ఓ పురుషుడు, అది కూడా ఓ స్టార్ హీరో చేసిన ఇలా నగ్న ఫొటో షూట్ చేయడం షాకిచ్చింది. అయితే ఇక్కడ రణవీర్ ధైర్యాన్ని కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఇది సమాజ పోకడకు విరుద్ధమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా ఈ ఇష్యూపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు.



ఈ క్రమంలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రణ్‌వీర్ న్యూడ్ ఫొటోస్ షేర్ చేసినందుకు చేసినందుకు గాను ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. ముంబై చెంబూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అశ్లీలత, అసభ్యతకు సంబంధించి 292, 293, 509 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 67 (A) సెక్షన్ కింద ముంబైకి చెందిన న్యాయవాది వేదిక చౌబే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఫొటోల కారణంగా రణ్‌వీర్ మహిళల మనోభావాలను దెబ్బతీశారని తన ఫిర్యాదులో ఆరోపించారు చౌబే. అదేవిధంగా ముంబైకి చెందిన ఓ ఎన్జీవో సంస్థ కూడా రణ్‌వీర్ సింగ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇలా ఈ వ్యవహారం జనం నోళ్ళ నుంచి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. చూడాలి మరి రణ్‌వీర్ సింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది!.
Published by:Sunil Boddula
First published:

Tags: Bollywood, Bollywood actor, Ranveer Singh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు