Dasari Narayana Rao: దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు తనయులపై కేసు.. చంపేస్తామంటూ బెదిరింపులు..

దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao)

Dasari Narayana Rao: దాస‌రి నారాయణరావు (Dasari Narayana Rao) ఉన్నా లేక‌పోయినా ఆయ‌న కుటుంబం మాత్రం ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటుంది. దానికి కార‌ణం ఇంట్లో ఆస్తి గొడ‌వ‌లే. తాజాగా మరోసారి దాసరి కుటుంబం వార్తల్లోకి వచ్చింది.

  • Share this:
దాస‌రి నారాయణరావు ఉన్నా లేక‌పోయినా ఆయ‌న కుటుంబం మాత్రం ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటుంది. దానికి కార‌ణం ఇంట్లో ఆస్తి గొడ‌వ‌లే. మొన్నామ‌ధ్య ఓ సారి దాస‌రి పెద్ద కోడ‌లు బ‌య‌టికి వ‌చ్చి త‌న ఆస్తి కొట్టేసారంటూ మోహ‌న్ బాబుపై ఆరోప‌ణ‌లు చేసింది. ఇక గతేడాది దాస‌రి పెద్ద కుమారుడు ప్ర‌భు క‌నిపించ‌కుండా పోయాడు. వారం రోజుల తర్వాత ఆయన మళ్లీ బయటికి వచ్చాడు. అది కూడా నాటకమే అని తెలిసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించిన కేస్ ఇది. తాజాగా మరోసారి దాసరి కుటుంబం హెడ్ లైన్స్‌లోకి వచ్చింది. ఈయన కుమారులు అరుణ్ కుమార్, ప్రభులపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. దానికి కారణం అప్పు తీర్చమని అడగడమే. అసలు విషయం ఏంటంటే.. దాసరి బతికున్న రోజుల్లో ఆయన తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సోమశేఖర్ రావు అట్లూరి నుంచి 2.10 కోట్లు అప్పుగా తీసుకున్నారు.

ఈయన గుంటూరు జిల్లా ఎల్లారెడ్డి గూడలో ఉంటారు. అయితే ఆయన అప్పు తీర్చకుండానే 2017లో దాసరి కన్నుమూసారు. దాంతో పెద్దల సమక్షంలో ఈ సమస్యను ఉంచారు సోమశేఖర్ రావు. దీనిపై 2018 నవంబర్ 13న దాసరి కొడుకులను కూడా కూర్చోబెట్టి.. 1.15 కోట్లు ఇప్పించడానికి పెద్దలు నిర్ణయించారని తెలుస్తుంది. అయితే ఇది జరిగి రెండేళ్ళవుతున్నా కూడా తన డబ్బు ఇంకా రాలేదని సోమశేఖర్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన జూబ్లీహిల్స్ రోడ్ నెం 46 లోని దాసరి కుమారుల ఇంటికి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతుంది.
dasari narayana rao,dasari narayana rao twitter,dasari narayana rao sons,dasari narayana rao sons police case,telugu cinema,దాసరి నారాయణరావు తనయులపై పోలీసు కేసు,దాసరి తనయులపై కేసు నమోదు,జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దాసరి తనయులపై కేసు నమోదు
దాసరి నారాయణ రావు తనయులు (Dasari Narayana Rao sons)

అప్పుడే సోమశేఖర్ రావును దాసరి తనయులు భయపెట్టారని.. ఇంకోసారి డబ్బు కోసం మా ఇంటికి వస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారంటూ పోలీసు స్టేషన్ గడప తొక్కారు సదరు వ్యక్తి. దాంతో దాసరి అరుణ్ కుమార్, ప్రభులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అసలు ఈ విషయంలో ఏం జరిగిందో నిజాలు తెలియాలంటే దాసరి తనయులు మీడియా ముందుకు రావాల్సిందే. అప్పటి వరకు ఈ కన్ఫ్యూజన్స్ తప్పవు.
Published by:Praveen Kumar Vadla
First published: