నాగబాబుపై కేసు నమోదు.. గాంధీని అవమానించాడంటూ..

Naga Babu Godse: నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా ఆయనపై నాగబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అటు కాంగ్రెస్ నాయకులతో పాటు మరికొందరు కూడా ఈయన్ని టార్గెట్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 20, 2020, 8:35 PM IST
నాగబాబుపై కేసు నమోదు.. గాంధీని అవమానించాడంటూ..
నాథూరాం గాడ్సేపై నాగబాబు వ్యాఖ్యలకు వర్మ సపోర్ట్ (nathuram godse naga babu)
  • Share this:
నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా ఆయనపై నాగబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అటు కాంగ్రెస్ నాయకులతో పాటు మరికొందరు కూడా ఈయన్ని టార్గెట్ చేస్తున్నారు. తాను ఎందుకలా అనాల్సి వచ్చిందో నాగబాబు చెప్పినా కూడా వినడం లేదు ఎవ్వరూ. ఇక ఇప్పుడు ఈయనపై పోలీసు కేసు కూడా నమోదైంది. మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ ఈయనపై కేసు నమోదు చేసారు. ఈ మేరకు నాగబాబుపై ఓయూ పోలీస్ స్టేషన్‌లో మే 20న కేసు నమోదు చేశారు. మహాత్మ గాంధీని నాగబాబు అవమానించాడని.. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మానవతా రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
నాగబాబు (Twitter/Nagababu)
నాగబాబు (Twitter/Nagababu)

మహాత్మా గాంధీ శాంతికి నిదర్మనమని ఆయన తెలిపాడు. అలాంటి గాంధీని హత్య చేసిన గాడ్సేను నాగబాబు పొగిడారని.. ఆయన నిజమైన దేశభక్తుడు అని చెప్పి గాంధీని అవమానించాడని ఆయన పేర్కొన్నాడు. ట్విట్టర్‌లో నాథూరామ్‌ను పొగుడుతూ గాంధీని అవమానించడం దేశాన్ని కించపర్చడమేనని తెలిపాడు ఆయన. వెంటనే నాగబాబు ట్విట్టర్ ఖాతాను బ్యాన్ చేయడమే కాకుండా ధర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలని కోరాడు ఆయన. మరి ఈ విషయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: May 20, 2020, 8:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading