ప్రధాని మోడీ బయోపిక్‌లో వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ చూశారా?

ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్‌లో వివేక్ ఒబెరాయ్

PM Narendra Modi Biopic | మొత్తానికి అనుకున్నట్లే సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ విడుదలవుతుందా ? ఒకవేళ రిలీజైతే అది భారతీయ జనతా పార్టీకి మేలు చేస్తుందా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

 • Share this:
  ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా దిగ్గజాల బయోపిక్‌లు తెరకెక్కగా...మరికొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని బయోపిక్‌లను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ షూటింగ్ మొదలైయ్యింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాని మోడీ పాత్రలో పోషిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గెటప్‌లో ఉన్న వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ప్రధాని మోడీ పాత్రకు వివేక్ ఒబెరాయ్ సరిపోయాడని కొందరు కితాబిస్తుండగా...మరికొందరు మాత్రం పరేష్ రావల్ అయితేనే మోడీ క్యారెక్టర్‌కు సరిగ్గా సరిపోతారని అభిప్రాయపడుతున్నారు.

  మోడీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ ఫోటోను ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అహ్మదాబాద్‌లో సోమవారం ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు తెలిపారు. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిపారు.  మాములు దిగువ తరగతి కుటుంబంలో పుట్టి..రైల్వే స్టేషన్‌లో ‘టీ’ అమ్ముతూ బీజేపీలో అంచలంచెలుగా ఎదిగి ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా...ఆపై దేశ ప్రధాన మంత్రిగా ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సినంత మసాలాతో ప్రధాని నరేంద్ర మోదీ జీవిత గాథను తెరకెక్కించనున్నారు. ‘మేరీకోమ్’ ఫేమ్ ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

  పెద్ద నోట్లు రద్దు, జీఎస్‌టీ వంటి సంచలనాత్మక నిర్ణయాలతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసారు మోదీ. ఈ సినిమాను సార్వత్రిక ఎన్నికల ముందు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అనుకున్నట్లే సార్వత్రిక ఎన్నికల ముందు ఈ సినిమా విడుదలవుతుందా ? ఒకవేళ రిలీజైతే అది భారతీయ జనతా పార్టీకి మేలు చేస్తుందా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
  First published: