Chinthakindhi.RamuChinthakindhi.Ramu
|
news18-telugu
Updated: June 2, 2019, 5:43 PM IST
అసిస్టెంట్లను కూడా ఎంతో కేరింగ్‌గా చూసుకునే వ్యక్తి వీరూ దేవగణ్... గ్రాఫిక్స్ లేని సమయలోనే ఆయన స్టంట్స్‌తో ఆశ్చర్యపరిచారు... అజయ్ దేవగణ్ కుటుంబానికి సానుభూతి లేఖ పంపిన ప్రధాని నరేంద్ర మోదీ...
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ తండ్రి, సీనియర్ ఫైట్ మాస్టర్ వీరూ దేవగణ్ మే 27న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ‘హిమ్మత్‌వాలా’, ‘మిస్టర్ ఇండియా’, కత్రోంకి కిలాడి’, ‘దిల్ వాలే’ వంటి ఎన్నో సినిమాలకు స్టంట్ డైరెక్టర్‌గా వ్యవహారించిన వీరూ దేవగణ్... 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వీరూ దేవగణ్ మృతిపై బాలీవుడ్ స్టార్‌లు షారుక్ ఖాన్, అమితాబ్, ఐశ్వర్యా, అభిషేక్ వంటి వారు సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అయితే ఎన్నికల ఫలితాల హడావుడిలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ... వీరూ దేవగణ్ మృతిపై స్పందించలేకపోయారు. అయితే ఎవ్వరూ ఊహించిన రీతిలో ఆయన తుదిశ్వాస విడిచిన ఐదు రోజుల తర్వాత అజయ్ దేవగణ్ తల్లి వీణ దేవగణ్‌కు సంతాపాన్ని తెలుపుతూ లేఖ రాశాడు నరేంద్ర మోదీ. పీఎంమో ఆఫీస్ నుంచి వచ్చిన ఈ సుదీర్ఘమైన లేఖను అజయ్ దేవగణ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘వీరూ దేవగణ్ చనిపోయారనే విషయం తెలిసి చాలా బాధపడ్డాను. బాలీవుడ్‌లో ఎంతో సాహసోపేతమైన స్టంట్స్ చేసేవారిలో వీరూ దేవగణ్ ముందుంటారు. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్లను కూడా ఎంతో కేరింగ్‌గా చూసుకునే వ్యక్తి వీరూ దేవగణ్. ఇప్పటిలా కాకుండా గ్రాఫిక్స్ లేని సమయంలో కూడా ఆయన చేసిన సాహసాలు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతాయి. పనిని నమ్ముకుని, పని కోసం ఏం చేయడానికైనా రెఢీగా ఉండే వీరూ దేవగణ్‌లాంటి వాళ్లు ఎంతో అరుదుగా కనిపిస్తారు...
మనం ఎంత రిస్క్ తీసుకుంటామనే దాన్ని బట్టే మన ప్రపంచం పయనిస్తుంది... వీరూ దేవగణ్ కుటుంబానికి ముఖ్యంగా వీణ దేవగణ్ జీకి నా ప్రగాఢ సానుభూతి...’ అంటూ తన లేఖలో వివరించారు నరేంద్ర మోదీ. ఈ లేఖను పోస్ట్ చేసిన అజయ్ దేవగణ్... ‘మా అమ్మ, మా కుటుంబం మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ రాసిన ఉత్తరం చూసి ఆశ్చర్యపోయాం. మోదీ ఈ లేఖతో మా మనసుల్ని టచ్ చేశారు. థ్యాంక్యూ సార్’ అంటూ కామెంట్ చేశారు అజయ్ దేవగణ్.
Published by:
Ramu Chinthakindhi
First published:
June 2, 2019, 5:43 PM IST