PM Narendra Modi.. పీఎం నరేంద్ర మోడీ బయోపిక్‌లో తొమ్మిది అవతారాల్లో వివేక్ ఓబరాయ్..

డిఫరెంట్ గెటప్స్‌లో పీఎం మోడీగా వివేక్ ఓబరాయ్

PM Naredra modi | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదలకు రెడీ గున్నాయి. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ‘పీఎం నరేంద్ర మోడీ’ టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా.తాజాగా ఈసినిమాలో వివేక్ ఓబరాయ్ తొమ్మిది డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు.

  • Share this:
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదలకు రెడీ గున్నాయి. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ‘పీఎం నరేంద్ర మోడీ’ టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్..నరేంద్రమోడీ పాత్రలో నటిస్తున్నారు. ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను  ఏప్రిల్ 12న విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. తాజాగా ఈసినిమాలో వివేక్ ఓబరాయ్ తొమ్మిది డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. అందులో ఒకటి హిమాలయాల్లో సాధువుగా ఉన్న గెటప్‌తో పాటు ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్‌తో పాటు,ఎమర్జన్సీ సమయంలో సర్దార్జీగా తిరిగినప్పటి గెటప్స్ ఉన్నాయి. ఈ గెటప్స్‌తో ఈసినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.లేటెస్ట్‌గా ఆ గెటప్స్‌కు సంబంధించిన లుక్స్‌ను విడుదల చేసారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ పాత్రలో నటించడానికి వివేక్..బాగానే కష్టపడుతున్నాడు. మాములు దిగువ తరగతి కుటుంబంలో పుట్టి..రైల్వే స్టేషన్‌లో ‘టీ’ అమ్ముతూ బీజేపీలో అంచలంచెలుగా ఎదిగి ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా...ఆపై దేశ ప్రధాన మంత్రిగా ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు.

PM Naredra modi | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదలకు రెడీ గున్నాయి. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ‘పీఎం నరేంద్ర మోడీ’ టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా.తాజాగా ఈసినిమాలో వివేక్ ఓబరాయ్ తొమ్మిది డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు.
తొమ్మిది డిఫరెంట్ గెటప్స్‌లో పీఎం మోడీగా వివేక్ ఓబరాయ్


ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సినంత మసాలా ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో ఉంది.ఈ సినిమాను దేశంలోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.ద‌ర్శ‌న్ కుమార్‌, బొమ‌న్ ఇరానీ, మ‌నోజ్ జోషీ, ప్ర‌శాంత్ నారాయ‌ణ‌న్‌, జ‌రీనా వాహ‌బ్‌, సేన్‌గుప్తాలు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను  సందీప్ సింగ్ నిర్మిస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల వేల విడుదల కాబోతున్న ఈ సినిమాకు ప్రతిపక్షాలు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలున్నాయి.

 
First published: