మోదీ బయోపిక్‌ గెటప్స్ : తొమ్మిది అవతారాల్లో కనిపించనున్న వివేక్ ఒబెరాయ్...

పీఎం నరేంద్ర మోదీ సినిమా ఫస్ట్ లుక్

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ఎలా ఉంటుందన్నదానిపై బీజేపీ నేతలు, ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.

  • Share this:
PM Narendra Modi : ఏప్రిల్ 11 ఎప్పుడొస్తుందా అని మన తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు మనకు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి. ఐతే... ఏప్రిల్ 12 ఎప్పుడొస్తుందా అని దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించిన పీఎం నరేంద్ర మోదీ బయోపిక్ రిలీజవుతోంది. ఒమంగ్ కుమార్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో... వివేక్ ఒబెరాయ్... మొత్తం 9 గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. ఇన్ని అవతారాలు ఎందుకంటే... ప్రధాని మోదీ తన జీవితంలో ఒక్కో స్టెప్పూ ఎక్కుతూ ఇవాళ ప్రధాని స్థాయికి ఎలా ఎదిగారో, ఏయే వయసుల్లో ఏమేం చేశారో అవన్నీ ఈ సినిమాలో చిత్రీకరించారు. అందుకోసం వివేక్ ఒబెరాయ్‌ని వివిధ గెటప్స్‌లో మోదీని పోలినట్లుగా చూపించారు.

ఈ కేరక్టర్ కోసం వివేక్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. రోజూ ఉదయం 2.30కు లేచేవాడు. దాదాపు 7 నుంచీ 8 గంటలపాటూ ఆయనకు మేకప్ వేసేవాళ్లు. ఉదయం 8 గంటలకు షూటింగ్ మొదలయ్యేది. మేకప్ చెరిగిపోకూడదన్న ఉద్దేశంతో వివేక్... షూటింగ్ జరిగినంతసేపూ... ఆహారంగా ద్రవ పదార్థాలు (liquids) మాత్రమే తీసుకున్నాడు.


పరిస్థితి ఎంతలా మారిపోయిందంటే... షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా చాలా సేపు వివేక్... మోదీ కేరక్టర్‌లోనే ఉండిపోయేవాడట. దీన్ని బట్టీ... అతను ఆ పాత్రలో ఎంతలా లీనమైపోయాడో అర్థం చేసుకోవచ్చు.

vivek oberoi,vivek oberoi movies,vivek oberoi family,vivek anand oberoi,vivek oberoi wife,vivek oberoi house,vivek oberoi net worth,vivek oberoi lifestyle,vivek oberoi song,vivek oberoi cars,vivek oberoi songs,vivek oberoi movie,vivek oberoi income,vivek oberoi father,suresh oberoi,vivek oberoi marriage,vivek oberoi biography,vivek oberoi upcoming movies,vivek oberoi as narendra modi,narendra modi biopic,narendra modi,modi biopic,pm narendra modi biopic,pm modi biopic,pm narendra modi,narendra modi movie,pm modi,modi,modi biopic trailer,modi biopic movie,modi biopic movie trailer,modi movie,narendra modi biopic film,biopic,narendra modi biopic movie,modi biopic poster,narendra modi biopic movie trailer,narendra modi biography,narendra modi biopic trailer,narendra modi biopic in hindi,పీఎం నరేంద్ర మోదీ,బయోపిక్,వివేక్ ఒబెరాయ్,మోదీ బయోపిక్ రిలీజ్,మోదీ బయోపిక్ ఎలా ఉంది,వివేక్ ఒబెరాయ్ కేరక్టర్,
మోదీగా వివేక్ ఒబెరాయ్ 9 గెటప్స్


నరేంద్ర మోదీ కేరక్టర్ చెయ్యడానికి వివేక్ ఒబెరాయ్‌ని ఎంచుకోగానే... వివిధ వయసుల్లో మోదీలా ఎలా నటించాలి అన్న దానిపై వివేక్‌తో రోజుల తరబడి చర్చించారు కాస్టింగ్ ప్రొడ్యూసర్ సందీప్ సింగ్. ఈ సినిమాలో 1957 నుంచీ 2019 వరకూ మోదీ జీవితంలోని వివిద దశలను చూపిస్తున్నారు. వివేక్‌కి మొత్తం 15 గెటప్స్ వేశారు. ఒక్కో గెటప్‌కీ రోజూ 7-8 గంటలు మేకప్ వేశారు. ఈ విషయంలో వివేక్ ఎంతో ఓపికతో ఉండటంతో... సినిమా యూనిట్ మొత్తం అదే శ్రద్ధతో పనిచేశారని సందీప్ సింగ్ తెలిపారు.

ఈ సినిమాలో ప్రధాని మోదీ కేరక్టర్‌లో వివేక్ ఒబెరాయ్‌తోపాటూ... బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, ప్రశాంత్ నారాయణన్, జరినా వాహెబ్, బర్ఖా సెన్‌గుప్తా, అంజన్ శ్రీవాస్తవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 12న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజవుతోంది.
First published: