ముందు ‘పీఎం నరేంద్ర మోదీ’బయోపిక్ చూడండి.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం..

ఇప్పటికే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర నేపథ్యంలో ప్రధాని మోదీ బయోపిక్ తెరకెక్కింది. తాజా పీఎం నరేంద్ర మోదీ బయోపిక్ చూడాలంటూ ఈసీని ఆదేశించింది సుప్రీంకోర్టు.

news18-telugu
Updated: April 15, 2019, 10:41 PM IST
ముందు ‘పీఎం నరేంద్ర మోదీ’బయోపిక్ చూడండి.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం..
సుప్రీంకోర్టు (File)
news18-telugu
Updated: April 15, 2019, 10:41 PM IST
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. అందులో రాజకీయ నాయకులకు సంబంధించిన బయోపిక్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పటికే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర నేపథ్యంలో ప్రధాని మోదీ బయోపిక్ తెరకెక్కింది.ఇక ఈ చిత్ర విడుదల ఆపాలంటూ కాంగ్రెస్ వేసిన పిటిషన్ సుప్రీం తిరస్కరించింది. అంతేకాదు ఈ సినిమా విడుదల  నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ కోర్టులో వేసింది.దాంతో కాంగ్రెస్ పార్టీ ‘పీఎం నరేంద్ర మోదీ’ బయోపిక్ విడుదలను ఆపు చేయాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈసీ కూడా సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు ఈసినిమాను విడుదల చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా.

PM Narendra Modi movie postponed yet again.. Supreme Court agrees to hear on April 8 pk.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ‘పీఎం నరేంద్ర మోడీ’ టైటిల్‌తో ఓ బయోపిక్ వ‌స్తుంది. దేశ్ భక్తి యే మేరా శక్తి అనేది ఈ చిత్ర క్యాప్షన్. ఈ సినిమాలో వివేక్ ఒబేరాయ్ ఈ చిత్రంలో నరేంద్రమోడీ పాత్రలో న‌టించాడు. narendra modi,narendra modi movie,narendra modi biopic,pm narendra modi movie,narendra modi movie postpone,narendra modi elections 2019,narendra modi supreme court stay,narendra modi movie supreme court pitition,hindi cinema,vivek oberoi narendra modi biopic,నరేంద్ర మోడీ బయోపిక్ వాయిదా,సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు,నరేంద్ర మోడీ బయోపిక్ విడుదల,వివేక్ ఒబేరాయ్ నరేంద్ర మోడీ,హిందీ సినిమా

దాంతో సదరు చిత్ర నిర్మాతలు ఈ సినిమా విడుదల విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరిస్తూ ..కేంద్ర ఎన్నికల సంఘాన్ని సినిమా చూడాల్సిందిగా ఆదేశించింది. ఆ తర్వాత సినిమా విడుదల చేయాలా వద్దా అనేది ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందికి వస్తుందా ? లేదా అన్నది ఈసీనే నిర్ణయించుకోవాలని సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది. సినిమా చూసిన తర్వాత ఏప్రిల్ 22 లోగా మీ అభిప్రాయాన్ని సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి అందజేయాలని కోరింది. ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేసిన  ఈ బయోపిక్‌లో పీఎం నరేంద్ర మోడీ పాత్రలో వివేక్ ఓబరాయ్ నటించాడు.  ఛాయ్ వాలా నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా.. ఆపై దేశప్రధానిగా నరేంద్ర మోడీ ఎలా ఎదిగాడు అనే వైనాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు.

 

First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...