PM Narendra Modi..పీఎం నరేంద్ర మోదీ బయోపిక్ నుంచి మరో ట్రైలర్ విడుదల..

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’.జాతీయ అవార్డు విజేత ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేసాడు. ఎపుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను ఎలక్షన్స్ తర్వాత విడుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించడంతో ఈ సినిమాను మే 24న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత రోజే విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదల చేసారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 21, 2019, 2:51 PM IST
PM Narendra Modi..పీఎం నరేంద్ర మోదీ బయోపిక్ నుంచి మరో ట్రైలర్ విడుదల..
PM నరేంద్ర మోదీ బయోపిక్ కొత్ పోస్టర్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 21, 2019, 2:51 PM IST
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’.జాతీయ అవార్డు విజేత ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేసాడు. ఎపుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను ఎలక్షన్స్ తర్వాత విడుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించడంతో ఈ సినిమాను మే 24న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత రోజే విడుదల చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల చివరి ఘట్టం తర్వాత వెల్లడైన అన్ని ఎగ్జిట్ పోల్స్.. ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఈ సినిమాను మే 24న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రలో యాక్ట్ చేసాడు. రీసెంట్‌గా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేసారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో ట్రైలర్‌ను విడుదల చేసారు.

ఇందులో ప్రధాన మంత్రి మోదీ..ఏ విధంగా చాయ్‌వాలా నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన తీరును చూపించారు. ఈ సినిమాను హిందీతో పాటు దేశంలోని 23 భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మోదీ బాల్యం నుంచి ఆర్ఆర్ఎస్‌లో జాయిన్ కావడం. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా.. ఆ పై దేశ ప్రధానిగా ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి దేశం అంటే గాంధీ కుటుంబం. కానీ నాకు మాత్రం దేశమే నా కుటుంబం అనే డైలాగులు బాగున్నాయి. అంతేకాదు కొత్త పోస్టర్‌లో ‘ఆ రహే హై దుబారా’ అంటూ పోస్టర్‌లో చూపించారు. అంటే మళ్లీ తమదే అధికారం అని చెప్పుకొచ్చారు.

PM Narendra Modi..Another trailer released from vivek oberoi's pm narendra modi biopic,narendra modi,chowkidar pm narendra modi twitter,PM Narendra Modi Trailer Talk,PM Narendra Modi,narendra modi biopic,pm narendra modi,pm narendra modi biopic,pm modi biopic,pm modi,pm narendra modi movie,narendra modi movie,narendra modi biopic movie trailer,pm narendra modi movie trailer,narendra modi's biopic,vivek oberoi narendra modi biopic,modi biopic,pm narendra modi trailer,pm narendra modi reaction on his biopic movie,pm narendra modi biopic controvercy,exit polls,vivek oberoi,may 24 Release pm narendra modi biopic,election commission of india,వెండితెరపై ప్రధాని నరేంద్ర మోదీ,వివేక్ ఓబరాయ్ పీఎం నరేంద్ర మోడీ,ప్రధాన మంత్రి ట్విట్టర్,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివేక్ ఓబరాయ్, మే 24న విడుదల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,మంత్రి నరేంద్ర మోదీ,పీఎం మోదీ,ప్రధాని మోదీ వివేక్ ఓబరాయ్ ఓమంగ్ కుమార్
PM నరేంద్ర మోదీ బయోపిక్ కొత్ పోస్టర్


అంతేకాదు ‘అబ్ కోహి నహీ రోఖ్ నహీ సఖ్తా’ అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు. మమ్మల్ని ఎవరు ఆపలేరు అన్న క్యాప్షన్ ఇచ్చి మళ్లీ అధికారం మాదే అంటూ చెప్పకనే చెప్పారు. . అంతేకదు ఈ సినిమాలో కాంగ్రెస్ పార్టీని తూర్పార బట్టే సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఈ  సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో దర్శన్ కుమార్, బొమన్ ఇరానీ, ప్రశాంత్ నారాయణ్,జరీనా వాహబ్,సేన్ గుప్తాలు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.  మొత్తానికి సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత విడుదల కాబోతున్న ఈ సినిమాల వెండితెరపై ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చూడాలి.

First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...