బాలీవుడ్‌ నటి వీడియోకి ప్రధాని నరేంద్ర మోదీ ఫిదా..

ప్రముఖ హిందీ నటి గుల్‌ పనాగ్‌.. తన కొడుకు నిహాల్‌ను ఒడిలో కూర్చోబెట్టుకుని ట్విటర్‌లో షేర్‌ చేసిన ఓ వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.

news18-telugu
Updated: October 18, 2019, 12:06 PM IST
బాలీవుడ్‌ నటి వీడియోకి ప్రధాని నరేంద్ర మోదీ ఫిదా..
Twitter
  • Share this:
ప్రముఖ హిందీ నటి గుల్‌ పనాగ్‌.. తన కొడుకు నిహాల్‌ను ఒడిలో కూర్చోబెట్టుకుని ట్విటర్‌లో షేర్‌ చేసిన ఓ వీడియోకు ప్రధాని నరేంద్ర మోదీ రెస్పాండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. పనాగ్‌ ఇటీవల తన కుమారుడు నిహాల్‌ను ఒడిలో కూర్చోబెట్టుకుని కొన్ని పుస్తకాలు చూపిస్తున్న ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో... ఆమె కుమారుడు ఆ పుస్తకాలపై ఉన్న ప్రధాని మోదీ చిత్రాన్ని గుర్తించి తల్లితో పాటు మోదీజీ అని పలుకుతుంటాడు. దీంతో ఆమె ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ నిహాల్‌ ఇప్పుడు మోదీని గుర్తిస్తున్నాడు అంటూ ఆమె మోదీకి ట్యాగ్‌ చేసింది. దీంతో ఆ వీడియో చూసిన ప్రధాని మోదీ.. అనంతరం పనాగ్‌ ట్వీట్‌కు స్పందించారు. ‘చాలా బాగుంది.. నిహాల్‌కు నా ఆశీస్సులు తెలియజేయండి. భవిష్యత్తులో అతడు అనుకున్న విధంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నా’ అని పేర్కొన్నారు.


కాగా గుల్ పనాగ్ బాలీవుడ్ కెరీర్ అంత సక్సెస్‌ఫుల్‌గా లేదు. 2003లో ధూప్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన గుల్‌కు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. దీంతో ఆమె రాజకీయాల్లోకి వెళ్లారు. అందులో భాగంగా ఆమె 2014లో తన స్వస్థలం అయిన చండీగఢ్ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు.
అయితే తన కొడుకును అడ్డం పెట్టుకొని ఈ ప్రయత్నాలన్ని ప్రధాని మోదీని మెప్పించేందుకే అంటూ సోషల్ మీడియాలో గుల్ పనాగ్‌ను ట్రోల్ చేస్తున్నారు. దీంతో దీనిపై స్పందించిన పనాగ్.. తనకు అలాంటీ అవసరం గాని, ఆలోచన గాని లేదని ట్రోల్ చేస్తున్నవారికి గట్టిగానే సమాదానం ఇచ్చింది.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు