వరుణ్ సినిమాను మెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ..

వరుణ్ ధావన్ హీరోగా హిందీలో తెరకెక్కుతున్న ‘కూలీ నెం.1’  చిత్ర బృందంపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. 

news18-telugu
Updated: September 13, 2019, 1:41 PM IST
వరుణ్ సినిమాను మెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ..
PTI
  • Share this:
వరుణ్ ధావన్ హీరోగా హిందీలో తెరకెక్కుతున్న ‘కూలీ నెం.1’  చిత్ర బృందంపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.  వివరాల్లోకి వెళితే.. డేవిడ్ ధావన్ (వరుణ్ ధావన్ తండ్రి) దర్శకత్వంలో వరుణ్ ధావన్, సారా అలీఖాన్‌ హీరో హీరోయిన్స్‌గా వస్తున్న సినిమా  'కూలీనెం.1'.  ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. అది అలా ఉంటే ఈ సినిమా హీరో వరుణ్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేస్తూ..   'షూటింగ్‌లో భాగంగా... సినిమా యూనిట్ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించామని తెలియజేస్తూ.. దానికి సంబందించిన ఓ ఫోటోను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.


అంతేకాదు ఆ ట్వీట్‌కు పిఎమ్‌ఓను ట్యాగ్ చేశాడు. ఆయన ట్విట్టర్‌లో రాస్తూ..  ‘ ఇండియాను ప్లాస్టిక్‌ ఫ్రీ దేశంగా మార్చాలన్న ప్రధాని మోడీ పిలుపు ప్రతి ఒక్కరికి ఆచరణీయం. దాన్ని మనం చేసే పనుల్లో చిన్న చిన్న మార్పుల ద్వారా సాధించవచ్చు అంటూ..  మా.. కూలీ నెం.1 షూటింగ్ లొకెషన్‌లో  ప్లాస్టిక్ సీసాలకు బదులుగా స్టీల్‌ బాటిళ్లను వాడాలని నిర్ణయించుకున్నాం... వాటినే వాడుతున్నాం.. అంటూ వరుణ్‌ ట్వీట్‌‌ చేశారు. దీనికి ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా  స్పందిస్తూ.. సినిమా టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.  మీది.. మంచి ఆలోచన అని.. ఇండియాను ప్లాస్టిక్‌ ఫ్రీ దేశంగా చేసేందుకు సినీ పరిశ్రమ ఈ విధంగా సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు.First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు