మాస్టర్‌ సినిమాకు అనుమతి ఇవ్వొద్దు.. ముఖ్యమంత్రికి దర్శకుడి లేఖ..

Vijay Master: థియేటర్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా.. తమ సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేయాలా అని చాలా మంది నిర్మాతలు వేచి చూస్తున్నారు. అందులో కొందరు పెద్ద నిర్మాతలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 5, 2020, 2:36 PM IST
మాస్టర్‌ సినిమాకు అనుమతి ఇవ్వొద్దు.. ముఖ్యమంత్రికి దర్శకుడి లేఖ..
విజయ్ మాస్టర్ సినిమా (vijay master)
  • Share this:
థియేటర్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా.. తమ సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేయాలా అని చాలా మంది నిర్మాతలు వేచి చూస్తున్నారు. అందులో కొందరు పెద్ద నిర్మాతలు కూడా ఉన్నారు. కోట్లకు కోట్లు పోసి తీసిన సినిమాలను విడుదల చేసుకోలేని నిస్సహయాతలో ఉన్నారు వాళ్లు. అందుకే లాక్‌డౌన్ ముగిసిన వెంటనే తమ సినిమాలను ఒక్కొక్కటిగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు స్టార్ హీరోలు కూడా. ఇలాంటి తరుణంలో థియేటర్లు తెరుచుకోవడమే ఆలస్యమిక.. కచ్చితంగా వరస సినిమాలు రాబోతున్నాయి. అభిమానులు కూడా సినిమాల కోసం బాగానే వేచి చూస్తున్నారు.
విజయ్ మాస్టర్ పోస్టర్ (Thalapathy Vijay)
విజయ్ మాస్టర్ పోస్టర్ (Thalapathy Vijay)


కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే థియేటర్స్ ఓపెన్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం. ఇలాంటి తరుణంలో విజయ్ నటించిన మాస్టర్ సినిమాను విడుదల చేయడానికి అనుమతి ఇవ్వొద్దని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి సీనియర్ దర్శకుడు కేయార్ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ అవుతుంది. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన మాస్టర్ సినిమాలో విజయ్ హీరోగా.. విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 9వ తేదీన విడుదల చేయాలనుకున్నా కూడా లాక్‌డౌన్ కారణంగా కుదరలేదు.
విజయ్ మాస్టర్ సినిమా (vijay master)
విజయ్ మాస్టర్ సినిమా (vijay master)

లాక్‌డౌన్ ముగిసిన వెంటనే ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. రెండు మూడు నెలలుగా నష్టాల్లో కూరుకుపోయిన తమను విజయ్ మాస్టర్ సినిమా కాపాడుతుందని థియేటర్ల యాజమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు వెంటనే అనుమతి ఇవ్వడం మంచిది కాదని కేయార్ ప్రభుత్వానికి సూచించారు. దానికి కారణం కూడా చెప్పాడు ఈయన. కరోనా తమిళనాడులో చాలానే ఉంది. ఇప్పటికే అక్కడ 20 వేలకు పైగానే కేసులు వచ్చాయి.
విజయ్ మాస్టర్ సినిమా (vijay master)
విజయ్ మాస్టర్ సినిమా (vijay master)

దాంతో లాక్‌డౌన్ ముగిసిన వెంటనే థియేటర్‌లలో మాస్టర్ లాంటి పెద్ద సినిమా విడుదల చేస్తే కచ్చితంగా వేలాది సంఖ్యలో అభిమానులు వస్తారు. దాంతో కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. అలా జరిగితే విజయ్‌కే చెడ్డ పేరు వస్తుంది.. కేవలం డబ్బుల కోసం చూసుకుని ప్రజల ప్రాణాలను రిస్కులో పెట్టొద్దంటూ ఆయన లేఖలో పేర్కొన్నాడు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలిక.
First published: June 5, 2020, 2:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading