హోమ్ /వార్తలు /సినిమా /

సూపర్ స్టార్‌కు షాక్...రిలీజైన రోజే తమిళ రాకర్స్‌లో రజినీకాంత్ ‘పేట’

సూపర్ స్టార్‌కు షాక్...రిలీజైన రోజే తమిళ రాకర్స్‌లో రజినీకాంత్ ‘పేట’

‘పేట’ చిత్రంలో రజనీకాంత్

‘పేట’ చిత్రంలో రజనీకాంత్

సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ‘పేట’ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌తో కుమ్మేస్తదనుకున్న ‘పేట’ సినిమాకు తమిళ రాకర్స్ పెద్ద షాక్ ఇచ్చింది.

ఇంకా చదవండి ...

  సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ‘పేట’ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తలైవా సరసన త్రిష, సిమ్రాన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దీఖీ, విజయ్ సేతుపతిలు ఇంపార్టెంట్‌ రోల్ ప్లే చేశారు. తాజాగా సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌తో కుమ్మేస్తదనుకున్న ‘పేట’ సినిమాకు తమిళ రాకర్స్ పెద్ద షాక్ ఇచ్చింది.


  సినీ ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. పైరసీ కారణంగా చాలా సినిమాలు బాక్సాపీస్ దగ్గర సరైన వసూళ్లు సాధించలేకపోయాయి. టాలీవుడ్‌తో పోలీస్తే కోలీవుడ్‌కి ఈ సమస్య చాలా ఎక్కువ. ముఖ్యంగా ‘తమిళ్ రాకర్స్’ పేరుతో చెలామణీ అయ్యే ఓ వెబ్‌సైట్, ఫిల్మ్ మేకర్స్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. సూర్య హీరోగా వచ్చిన ‘సింగం 3’ సినిమాను లైవ్‌లో ప్రసారం చేస్తామంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసి, అందరికీ షాక్ ఇచ్చారు తమిళ్ రాకర్స్ అడ్మిన్స్. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం చెందడానికి పైరసీ కూడా ప్రధాన కారణం. రీసెంట్‌గా రజినీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘2.O’ సినిమాకు కూడ ఈ రకంగానే విడుదల రోజే వెబ్‌సైట్‌లో రిలీజ్ చేసి ఈ సినిమా నిర్మాతలకు చుక్కులు చూపించారు.


  ఇప్పటికే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాను కూడా తమిళ రాకర్స్ ఒదలలేదు. తాజాగా తమిళ రాకర్స్ పెట్టిన ‘పేట’ సినిమాను కొన్ని లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరోవైపు అజిత్ ‘విశ్వాసం’ సినిమాను కూడా తమిళ రాకర్స్ అటాక్ చేసారు. మొత్తానికి తమిళ రాకర్స్‌ దెబ్బకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కుదేలవుతున్నాయి. మరోవైపు సంక్రాంతికి రాబోయే సినిమాలకు తమిళ రాకర్స్ నుంచి బెడద తప్పకపోవచ్చు.


   ఇవి కూడా చదవండి 


  Petta Telugu Movie Review:‘పేట’ మూవీ రివ్యూ..రజినీ ఫ్యాన్స్‌కు మాత్రమే


  సినిమా థియేటర్‌లో రజనీకాంత్ అభిమాని పెళ్లి


  NTR Kathanayakudu Movie Review: ఎన్.టి.ఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ


   

  First published:

  Tags: Ajith, Bala Krishna Nandamuri, Kollywood, NTR Biopic, Peta, Rajinikanth, Tollywood

  ఉత్తమ కథలు