గుడ్ న్యూస్.. బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ సేఫ్..

చాలా రోజులుగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీలో కూడా ఒక‌టే టెన్ష‌న్ ఇర్ఫాన్ ఖాన్ ఇప్పుడు ఎలా ఉన్నాడు..? అరుదైన వ్యాధితో కొన్ని నెల‌లుగా లండ‌న్‌లోనే ఉన్నాడు ఇర్ఫాన్. ఆ మ‌ధ్య విడుద‌లైన ఓ ఫోటో చూసి అస‌లు మ‌నం చూసిన న‌టుడేనా ఈయ‌న అనుకునేలా మారిపోయాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 25, 2018, 12:49 PM IST
గుడ్ న్యూస్.. బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ సేఫ్..
ఇర్ఫాన్ ఖాన్
  • Share this:
చాలా రోజులుగా అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీలో కూడా ఒక‌టే టెన్ష‌న్ ఇర్ఫాన్ ఖాన్ ఇప్పుడు ఎలా ఉన్నాడు..? అరుదైన వ్యాధితో కొన్ని నెల‌లుగా లండ‌న్‌లోనే ఉన్నాడు ఇర్ఫాన్. ఆ మ‌ధ్య విడుద‌లైన ఓ ఫోటో చూసి అస‌లు మ‌నం చూసిన న‌టుడేనా ఈయ‌న అనుకునేలా మారిపోయాడు. అంత బ‌క్క‌గా మారిపోయి.. శ‌రీరం చిక్కిపోయి క‌నిపించాడు. అస‌లు ఈ న‌టుడు బ‌త‌క‌డం కూడా క‌ష్ట‌మే అన్నారు డాక్ట‌ర్లు. ఇదే విష‌యాన్ని ఇర్ఫాన్ ఖాన్ కూడా చెప్పాడు. ఈయన తెలుగు ప్రేక్షకులకు "సైనికుడు" సినిమాతో చేరువయ్యాడు.

piku actor irfan khan safe.. coming to india for diwali celebrations.. గుడ్ న్యూస్.. బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ సేఫ్.. bollywood actor, irfan khan, safe,sainikudu,mahesh babu,loncon,treatment,rare decease, coming to india for diwali celebrations,piku,deepika padukone,hindi cinema,ఇర్ఫాన్ ఖాన్,హిందీ సినిమా,హిందీ మీడియం,లండన్,ట్రీట్ మెంట్,అరుదైన వ్యాధి,దివాళి సెలెబ్రేషన్స్,పీకూ,హిందీ మీడియం 2,సైనికుడు,మహేష్ బాబు,బాలీవుడ్,అభిమానులు,ఫ్యాన్స్
ఇర్ఫాన్ ఖాన్

అయితే దేవుడి ద‌య‌.. అభిమానుల ప్రార్థ‌న‌ల‌తో ప్ర‌స్తుతానికి ఈయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డింద‌ని తెలుస్తుంది. ఇంత‌కంటే మంచి విష‌యం ఏంటంటే.. ఈయ‌న చాలా నెల‌ల త‌ర్వాత ఇండియాకు వ‌స్తున్నాడు. దివాళి త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి జ‌రుపుకోడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ విష‌యాన్ని అత‌డి మేనేజ‌ర్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు. అయితే పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడా అనేదానికి మాత్రం స‌మాధానం రాలేదు.. మున‌ప‌టితో పోలిస్తే ఇప్పుడు ఇర్ఫాన్ చాలా బాగున్నాడ‌ని.. త్వ‌ర‌లోనే మ‌రింత ఆరోగ్యంగా అవుతార‌ని చెబుతున్నారు.

piku actor irfan khan safe.. coming to india for diwali celebrations.. గుడ్ న్యూస్.. బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ సేఫ్.. bollywood actor, irfan khan, safe,sainikudu,mahesh babu,loncon,treatment,rare decease, coming to india for diwali celebrations,piku,deepika padukone,hindi cinema,ఇర్ఫాన్ ఖాన్,హిందీ సినిమా,హిందీ మీడియం,లండన్,ట్రీట్ మెంట్,అరుదైన వ్యాధి,దివాళి సెలెబ్రేషన్స్,పీకూ,హిందీ మీడియం 2,సైనికుడు,మహేష్ బాబు,బాలీవుడ్,అభిమానులు,ఫ్యాన్స్
ఇర్ఫాన్ ఖాన్

ఇప్ప‌టికీ కాస్త ప్ర‌మాదక‌రంగానే ఉన్నా కూడా ప్రాణాల‌కు మాత్రం వ‌చ్చిన ముప్పేం లేద‌ని చెప్ప‌డంతో అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ కూడా ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే ఈయ‌న ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాడు.. ముఖ్యంగా ఆయ‌న అనారోగ్యం కార‌ణంగానే కొన్ని సినిమాలు ఆరంభం కాకుండా ఆగిపోయాయి. ఇప్పుడు ఇండియాకు వ‌స్తున్నాడు కానీ షూటింగ్స్ చేస్తాడా లేదా అనేది మాత్రం అనుమాన‌మే. దానికి ఇంకా స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. మొత్తానికి ఇర్ఫాన్ ఖాన్ ఇండియా వ‌స్తున్నాడనే వార్త తెలిసి ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: October 25, 2018, 12:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading