ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార.. వైరల్ అవుతున్న ఫోటో..

రోజకో కొత్త హీరోయిన్ వస్తున్న సినిమా ఇండస్ట్రీలో కథానాయికగా నిలదొక్కుకుని ఉండటం అంటే మాటలు కాదు. అలాంటిది దాదాపు పదిహేనేళ్లుగా అటు కోలీవుడ్,టాలీవుడ్ సహా మొత్తం దక్షిణాదిని తన సినిమాలతో ఏలుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార, అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో నయనతారకు భారీ చిత్రాల్లో నటిస్తూ దూకుడు చూపిస్తోంది.వీరిద్దరూ ఏథెన్స్ లో తీసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: June 12, 2019, 2:03 PM IST
ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార.. వైరల్ అవుతున్న ఫోటో..
వెనక అద్దంలో ప్రియుడు విఘ్నేష్ శివన్ చాయ చిత్రం
  • Share this:
రోజకో కొత్త హీరోయిన్ వస్తున్న సినిమా ఇండస్ట్రీలో కథానాయికగా నిలదొక్కుకుని ఉండటం అంటే మాటలు కాదు. అలాంటిది దాదాపు పదిహేనేళ్లుగా అటు కోలీవుడ్,టాలీవుడ్ సహా మొత్తం దక్షిణాదిని తన సినిమాలతో ఏలుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార, అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో నయనతారకు భారీ చిత్రాల్లో నటిస్తూ దూకుడు చూపిస్తోంది. సినిమాలే కాదు. వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలిచింది ఈ నటి. మొదట్లో వల్లవన్’ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్ కమ్ సహనటుడు శింబుతో ఆమె ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత వారి ప్రేమ బంధం మూణాళ్ల ముచ్చటే అయింది. అంతేకాదు ఆ తర్వాత శింబు సినిమాల్లో నటించనని తేల్చిచెప్పేసింది. ఆ తర్వాత 'విల్లు' షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో ప్రేమలో పడింది. అంతేకాదు ప్రభుదేవాతో పెళ్లి కోసం క్రిష్టియన్ నుంచి హిందువుగా మతం కూడా మార్చుకుంది. ఆ తర్వాత ప్రభుదేవాతో రిలేషన్‌ను నయనతార రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది.

ప్రస్తుతం నయనతార తమిళ యువదర్శకుడు విగ్నేష్ శివన్ తో ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ దొరికితే వీరిద్దరూ విదేశాలకు వెకేషన్‌కు ఎగిరిపోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రేమ జంట గ్రీస్ లోని ఏథెన్స్ లో విహార యాత్ర చేస్తున్నారు. వీరిద్దరూ ఏథెన్స్ లో తీసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార అదిరిపోయే గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తోంది ఈ ఫోటోలో. ఇక విగ్నేష్ శివన్ నయనతార వెనుక అద్దంలో ప్రతిబింబంలో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు.. కనీసం ఈసారైనా శుభవార్తతో తిరిగివస్తారా అంటూ నయన్, విగ్నేష్ జంటపై అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి ముచ్చటగా మూడో ప్రేమికుడుతోనైనా నయనతార పెళ్లి పీఠాలెక్కుతుందా లేదా అనేది చూడాలి.
First published: June 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు