హోమ్ /వార్తలు /సినిమా /

Union Budget 2021: EPFO సభ్యులకు గుడ్ న్యూస్.. ఉద్యోగి PFకు కేంద్రం భరోసా

Union Budget 2021: EPFO సభ్యులకు గుడ్ న్యూస్.. ఉద్యోగి PFకు కేంద్రం భరోసా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కంపెనీలు మూతపడితే ఉద్యోగి పీఎఫ్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తం జమ అయ్యే అవకాశాలే ఉండవు. ఇకపై ఉద్యోగుల పీఎఫ్ ను జమచేయడంలో ఆలస్యం చేస్తే.. ఆయా సంస్థలు ఉద్యోగులందరికీ చెల్లించే పీఎఫ్ ను ఖర్చు కింద పరిగణించమని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది.

ఇంకా చదవండి ...

సకాలంలో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) చెల్లిస్తే చాలు ఇక ఎంప్లాయర్ కు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేలా కేంద్ర బడ్జెట్ లో సరికొత్త విధానాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నిజానికి ఇది ఉద్యోగులకు శ్రీరామ రక్షలా నిలవటం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఉద్యోగులకు ఎంప్లాయర్స్ ఇచ్చే జీతంలోని కొంత భాగాన్ని కట్ చేసి పీఎఫ్ గా చెల్లించే సంస్థలు ఆపని మాత్రం సకాలంలో చేయకపోగా కొన్ని సంస్థలు శాశ్వతంగా వీటిని ఎగరగొట్టడం వంటి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయి. అంతేకాదు సంస్థ మూసివేతకు గురైనప్పుడు ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యల్లో పీఎఫ్ చెల్లింపు సమస్య కూడా ఒకటి. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి బోలెడు కంప్లైంట్లు వెల్లువెత్తటంతో స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ దీనికి శాశ్వత పరిష్కారాన్ని అమలుజరిపేలా చొరవ తీసుకుంది. కొన్ని యాజమాన్యాలు ఉద్యోగి వాటాను జీతంలోంచి వసూలు చేస్తాయి. తమ వాటాతో కలిపి ఆతరువాత తీరిగ్గా ఎప్పుడో ఈపీఎఫ్ లో జమ చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా వాటిని జమచేయటం లేదు. ఈ కారణంగా ఉద్యోగికి పూర్తి జీతం రాక, పీఎఫ్ అకౌంట్లో జబ్బులు జమకాక, పీఎఫ్ పై చెల్లించే వడ్డీ చేతికి అందక లబోదిబోమనే పరిస్థితులకు ఇక చెక్ పడనుందన్నమాట.

పన్ను కట్టాల్సిందే..

కంపెనీలు మూతపడితే ఉద్యోగి పీఎఫ్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తం జమ అయ్యే అవకాశాలే ఉండవు. ఇకపై ఉద్యోగుల పీఎఫ్ ను జమచేయడంలో ఆలస్యం చేస్తే.. ఆయా సంస్థలు ఉద్యోగులందరికీ చెల్లించే పీఎఫ్ ను ఖర్చు కింద పరిగణించమని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. ఆయా సంస్థలు ఉద్యోగులకు చెల్లించే పీఎఫ్‌ మొత్తానికి కూడా ఆదాయంగా పరిగణిస్తూ.. కంపెనీలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులకు, కార్మికులకు సంబంధించిన ఈఎస్ ఐ వంటి ఇతర సామాజిక భద్రత పథకాల చెల్లింపుల విషయంలోనూ యాజమాన్యాలకూ ఇది వర్తిస్తుందని కేంద్ర బడ్జెట్ స్పష్టంచేసింది. ఈమేరకు ఇన్కంట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ రూల్స్ లో మార్పులు చేశారు. వడ్డీ నష్టం, పీఎఫ్ నగదు నష్టం చేతికందకుండా ఉద్యోగులకు భద్రత, భరోసా కల్పించేలా మోడీ సర్కారు ఈ మార్పులను తీసుకువచ్చింది.

8.5శాతం వడ్డీ..

పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులు జమ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 8.5 శాతం వడ్డీ డబ్బులు ఇప్పటికే చందాదారుల అకౌంట్లలో జమయ్యింది. 8.5 శాతం వడ్డీ రేటు అనేది గత ఏడేళ్లలో చాలా తక్కువ వడ్డీ రేటు. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్లు తక్కువ. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ చెల్లిస్తామని కేంద్రం ప్రకటించింది.

First published:

Tags: EPFO

ఉత్తమ కథలు