రజినీకాంత్ ‘పేట’కు దక్కని థియేటర్స్...ఆ నలుగురిపై నిర్మాత ఫైర్

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొంత మంది వ్యక్తులు తమ చెప్పుచేతుల్లో థియేటర్స్‌ ఉంచుకొని చిన్న నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ‘పేట’ నిర్మాత అశోక్ వల్లభనేని మీడియా ముఖంగా తన ఆక్రోషం వెల్లగక్కారు. ఇపుడీ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.

news18-telugu
Updated: January 7, 2019, 2:33 PM IST
రజినీకాంత్ ‘పేట’కు దక్కని థియేటర్స్...ఆ నలుగురిపై నిర్మాత ఫైర్
‘పేట’లో రజినీకాంత్ (ట్విట్టర్ ఫోటో)
news18-telugu
Updated: January 7, 2019, 2:33 PM IST
ఏ ఇండస్ట్రీ చూసినా ఏ మున్నది గర్వకారణం అన్నట్టు ప్రతి ఇండస్ట్రీలో వ్యవస్థికృతంగా కొన్ని వ్యవస్థలు ఒక మాఫియాల పాతుకుపోయాయి. అందుకు సినిమా ఇండస్ట్రీ మినహాయింపేమి కాదు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొంత మంది వ్యక్తులు తమ చెప్పుచేతుల్లో థియేటర్స్‌ ఉంచుకొని చిన్న నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ‘పేట’ నిర్మాత అశోక్ వల్లభనేని మీడియా ముఖంగా తన ఆక్రోషం వెల్లగక్కారు. ఇపుడీ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.

తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పేట’ ఈ నెల 10న సంక్రాంతికి తమిళ్‌తో హిందీ, తెలుగు భాషల్లో విడుదల కాబోతుంది. తమిళ్, హిందీ వెర్షన్స్‌కు సంబంధించి ఎలాంటి ప్రాబ్లెమ్స్ లేవు. కానీ తెలుగులో ‘పేట’కు సరైన థియేటర్స్ ఏవి ఇవ్వడం లేదంటూ దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబుల తీరును ఎండగట్టాడు అశోక్ వల్లభనేని.

Super Star Rajinikanth’s Petta Telugu Version Trailer Released
రజినీకాంత్ ‘పేట’(ట్విట్టర్ ఫోటో)


ఇక్కడ థియేటర్స్‌ను గుప్పిట్లో పెట్టుకోవడం అనేది గత కొన్నేళ్లుగా జరగుతూనే ఉంది. ఆ సినిమాలు బాగున్నా..లేకపోయినా వాళ్ల సినిమాలు మాత్రమే ఆడించడం పరిపాటిగా మారిందన్నారు. అంతేకాదు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పేట’కు సదరు నిర్మాతలు థియేటర్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. అశోక్ వల్లభనేని వ్యాఖ్యలకు మరో నిర్మాత ప్రసన్న కుమార్ మద్దతు పలకడం విశేషం.
ఈ వారానికి ‘పేట’ సినిమాకు థియేటర్స్ లేకపోయినా..రెండో వారం నుంచి ప్రతి పేటలో ‘పేట’ సినిమా ఆడటం ఖాయం అని అశోక్ వల్లభనేని చెప్పారు. సంక్రాంతి అనేది రెండు, మూడు సినిమాలకు సొంతం కాదని..ఇక్కడ ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలు చూసే ప్రేక్షకులు ఉంటారని..వాళ్లను పట్టించుకోకుండా  దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబులు థియేటర్స్‌ను చేతిలో పెట్టుకొని అడ్డుకుంటున్నారని విమర్శించారు నిర్మాత అశోక్ వల్లభనేని.

ఒకప్పుడు దాసరి ఉన్నపుడు ఈ థియేటర్స్ మాఫియా గురించి గళం విప్పేవారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇలాంటి విషయాలపై ఇండస్ట్రీలో మాట్లాడే వారే కరువయ్యారు. చాలా రోజుల తర్వాత నిర్మాత అశోక్ వల్లభనేని..థియేటర్స్ మాఫియాపై గళం విప్పడం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఇపుడీ విషయం ఎంత దూరం వెళుతుందో చూడాలి.

షమా సికందర్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్

Loading...

ఇవి కూడా చదవండి

‘బాషా’ ద‌ర్శ‌కుడితో క్రిష్.. ఆ రాజుల‌ చరిత్రపై ఫోకస్..

ర‌జినీకాంత్ చివ‌రి సినిమా రాజ‌మౌళితో.. తెర‌వెన‌క క‌థేంటి..?

క్రిష్ Vs రామ్ గోపాల్ వర్మ.. ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’లో ఏం ఉండ‌బోతుంది..?
First published: January 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...