సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్.నారాయణ మూర్తి ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’... విడుదల ఎపుడంటే..

ఆర్.నారాయణమూర్తి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను తెరమీద నిలిపించిన పీపుల్స్ స్టార్. పేదలపై జరుగుతున్న అన్యాయాలను తన సినిమాలో చూపించే హీరో. తాజాగా ఆయన స్వీయ దర్శకత్వంలో ‘మార్కెట్‌ లో ప్రజాస్వామ్యం’ అనే సినిమాను స్నేహచిత్ర పతాకంపై  తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.ఈ సందర్భంగా ఆర్.నారాయణ మూర్తి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.

news18-telugu
Updated: July 1, 2019, 1:36 PM IST
సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్.నారాయణ మూర్తి ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’... విడుదల ఎపుడంటే..
మార్కెట్‌లో ప్రజాస్వామ్యం సెన్సార్ పూర్తి
  • Share this:
ఆర్.నారాయణమూర్తి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను తెరమీద నిలిపించిన పీపుల్స్ స్టార్. పేదలపై జరుగుతున్న అన్యాయాలను తన సినిమాలో చూపించే హీరో. ఆయన వెండితెర మీద ప్రజాపోరాటాన్ని చూపిస్తున్న ప్రజల స్టార్. పాతికేళ్లుగా పరిశ్రమలో ఉన్నా.. సినిమా సంస్కృతిని ఒంటపట్టించుకోని ముక్కుసూటి మనిషి. తాజాగా ఆయన స్వీయ దర్శకత్వంలో ‘మార్కెట్‌ లో ప్రజాస్వామ్యం’ అనే సినిమాను స్నేహచిత్ర పతాకంపై  తెరకెక్కించారు. ఈ సినిమా ఆడియోను మొన్నీ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను సమకాలీన రాజకీయ అంశాలతో తెరకెక్కించారు. పేరుకే ప్రజాస్వామ్య దేశం అనే మాట. ఎపుడో ప్రజాస్వామ్యం మార్కెట్‌ పాలైందనే అంశంతో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. జూలై 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Peoples Star R.Narayana Murthy Market lo Prajaswamyam censor Completed and Release date Fixed,r narayana murthy,r narayana murthy market lo prajaswamyam,chiranjeevi,r narayana murthy,r narayana murthy speech,narayana murthy,mega star chiranjeevi,chiranjeevi about r narayana murthy,madala ranga rao,r narayana murthy about chiranjeevi,megastar chiranjeevi,r narayana murthy latest speech,dasari narayana rao,chiranjeevi movies,r narayana murthy comments on chiranjeevi,r narayana murthy interview,r narayanamurthy,r narayana murthy comments,r narayana murthy sensational comments on chiranjeevi,r narayana murthy market lo prajaswamyam,market lo prajaswamyam,,market lo prajaswamyam audio,market lo prajaswamyam,chiranjeevi launches market lo prajaswamyam audio,ఆర్ నారాయణ మూర్తి,చిరంజీవి,పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి ఆర్ నారాయణ మూర్తి,మార్కెట్ లో ప్రజాస్వామ్యం ఆడియో ఆవిష్కరించిన చిరంజీవి,
‘మార్కెట్‌ లో ప్రజాస్వామ్యం’ (ఫేస్‌బుక్ ఫోటో)


ఈ సందర్భంగా ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ.. మన దేశంలో ఎన్నికలకు, డబ్బులకు విడదీయరాని సంబంధం ఏర్పడింది. పైసామే పరమాత్మ అన్నట్టు ఇక్కడ పైసలున్నవాడు టిక్కెట్లు కొనుక్కొని ఎన్నికల్లో పోటీచేసి పదవులు సాధించుకుంటున్నారు. ఏదో కొంత మంది తప్పిస్తే..ఆర్థికంగా స్తోమత లేనివారికి పదవులు దక్కడం లేదు. డబ్బు లేకుంటే పదవులు రావా ? పదవులన్ని ధనవంతుల సొంతమా ? అంతేకాదు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలు సిద్దాంతాలకు కట్టుబడి పనిచేస్తాయా ? అని చెప్పుకొచ్చారు. డబ్బులు వెదజల్లి రాజకీయాల్లో వచ్చిన వారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనే లేదు. అందుకే ఈసినిమాలో వారసత్వ రాజకీయాలు, పార్టీ ఫిరాయింపు రాజకీయాలను ఇందులో ప్రస్తావించినట్టు చెప్పుకొచ్చారు.

First published: July 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>