కరోనా పై ప్రభుత్వాలకు పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తి అద్భుత సందేశం..

ఆర్.నారాయణమూర్తి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను తెరమీద చూపించిన పీపుల్స్ స్టార్. ఈయన తాజాగా కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అద్భుత సందేశం ఇచ్చారు.

news18-telugu
Updated: April 17, 2020, 6:01 PM IST
కరోనా పై ప్రభుత్వాలకు పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తి అద్భుత సందేశం..
ఆర్.నారాయణ మూర్తి (ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
ఆర్.నారాయణమూర్తి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను తెరమీద చూపించిన పీపుల్స్ స్టార్. పేదలపై జరుగుతున్న అన్యాయాలను తన సినిమాలో చూపించే హీరో. ఆయన వెండితెర మీద ప్రజాపోరాటాన్ని చూపిస్తున్న ప్రజల స్టార్. పాతికేళ్లుగా పరిశ్రమలో ఉన్నా.. సినిమా సంస్కృతిని ఒంటపట్టించుకోని ముక్కుసూటి మనిషి. ఎప్పటి కప్పుడు సినిమాలతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేసే ఆర్.నారాయణ మూర్తి కరోనా మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని ప్రశంసించారు. ఎక్కువ జన సాంద్రత కలిగిన మన దేశంలో వైరస్ నిరోధానికి లాక్‌డౌన్‌కు మించిన ఆయుధం లేదు. ఈ లాక్‌డౌన్ కారణంగా చాలా మంది తమ పక్కవారికి సహాయం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినీ నటులు పేదలను ఆదుకోవడానికి ముందుకు రావడం శుభపరిణమం అన్నారు. ఇలా ఎన్ని రోజులని ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధిస్తాయి. దీనికో పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి. మన దగ్గర ఉన్నన్ని రోజులు మనతో పాటు వేరే వాళ్లకు కూడా ఇంత సాయం చేస్తాం.


ఇలా లాక్‌డౌన్ పొడిగించడం మూలానా దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తింటుంది. కొన్ని రోజులకు తినడానికి తిండి ఉండదు. అపుడు మళ్లీ ఉన్న దోచుకోవాలన్న బుద్ది లేని వాళ్లకు వస్తోంది. కాబట్టి ప్రభుత్వాలు సాధ్యమైనంత తొందరలో కరోనా మహామ్మారిపై ఒక పరిష్కారాన్ని కనుక్కొవాలని కోరారు.
First published: April 17, 2020, 5:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading