Power Star Pawan Kalyan: ప‌‌‌వ‌ర్‌స్టార్ కోసం డైలాగ్స్ రాస్తున్న జాన‌ప‌ద రైట‌ర్

Penchala das dialogues for pawan kalyan and rana movie

Power Star Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి జానపద రైటర్ పెంచలదాస్ మాటలను అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

  • Share this:
    ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పీడు చూపిస్తున్నాడు. ఒక‌వైపు వ‌కీల్‌సాబ్ సినిమాను పూర్తి చేశాడు. ఏప్రిల్ 9న వ‌కీల్‌సాబ్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాక‌ముందే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాతో పాటు మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియమ్ సినిమా రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. రెండు సినిమాల‌ను ఏక‌ధాటిగా పూర్తి చేసేస్తున్నాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా చేస్తుంటే సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో షెడ్యూల్‌ను పూర్తి చేస్తున్నాడు.

    సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ రీమేక్ విష‌యానికి వ‌స్తే.. ఇందులో రానా ద‌గ్గుబాటి కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. కాగా.. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాకు ప్రముఖ జాన‌ప‌ద ర‌చ‌యిత పెంచ‌ల‌దాస్ మాట‌ల‌ను రాస్తున్నాడ‌ట‌. శ్రీశైలం ఘాట్ రోడ్‌లో వేసి ఓ స్పెష‌ల్ సెట్స్ వేశారు. ఇందులో పోలీస్ స్టేష‌న్ సెట్‌, గిరిజ‌న‌వాడ సెట్ ఉన్నాయి. ఈ లొకేష‌న్‌లో నెక్ట్స్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది చిత్ర యూనిట్‌.

    మ‌ల‌యాళంలో బిజు మీన‌న్ చేసిన పాత్ర‌ను తెలుగులో ప‌వ‌న్ చేస్తుండ‌గా, పృథ్వీరాజ్ పాత్రలో రానా క‌నిపించ‌బోతున్నాడు. ఈ ఏడాదిలోనే, ముఖ్యంగా సెప్టెంబ‌ర్ 9నే ఈ సినిమాను విడుద‌ల చేసేలా నిర్మాత‌లు ప్లాన్ చేశార‌ట‌. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి ఇందులో ప‌వ‌న్ జోడీగా న‌టించ‌నుంది.
    Published by:Anil
    First published: