హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Pradeep: యాంక‌ర్ ప్ర‌దీప్‌తో పెళ్లి చూపులు.. పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణం చెప్పిన ఙ్ఞానేశ్వ‌రి

Anchor Pradeep: యాంక‌ర్ ప్ర‌దీప్‌తో పెళ్లి చూపులు.. పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణం చెప్పిన ఙ్ఞానేశ్వ‌రి

ప్రదీప్ ఫైల్ ఫొటో

ప్రదీప్ ఫైల్ ఫొటో

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కే కాదు వెండితెర వీక్ష‌కుల‌కు సైతం యాంక‌ర్ ప్ర‌దీప్(Anchor Pradeep) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ్యాఖ్య‌త‌గా త‌నదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమ‌ర్‌తో అద‌ర‌గొట్టే ప్ర‌దీప్.. సుమ త‌రువాత గొప్ప యాంక‌ర్‌గా పేరు సంపాదించుకున్నారు

ఇంకా చదవండి ...

  Anchor Pradeep- Gnaneswari: బుల్లితెర ప్రేక్ష‌కుల‌కే కాదు వెండితెర వీక్ష‌కుల‌కు సైతం యాంక‌ర్ ప్ర‌దీప్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ్యాఖ్య‌త‌గా త‌నదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమ‌ర్‌తో అద‌ర‌గొట్టే ప్ర‌దీప్.. సుమ త‌రువాత గొప్ప యాంక‌ర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఇక బుల్లితెర ద్వారా పాపులర్ అయిన ప్రదీప్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీ ఈ శుక్ర‌వారం(జ‌న‌వ‌రి 29) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ త‌న‌కు మంచి పేరు తీసుకొస్తుంద‌న్న ధీమాలో ప్ర‌దీప్ ఉన్నాడు. అయితే మోస్ట్ వాంటెడ్ యాంక‌ర్‌గా కొన‌సాగుతోన్న ప్ర‌దీప్.. టాలీవుడ్‌లోని మోస్ట్ బ్యాచుల‌ర్ సెల‌బ్రిటీల లిస్ట్‌లో ఒక‌డు. 34 ఏళ్ల ఈ యాంక‌ర్ పెళ్లిపై ప‌లు షోల్లోనూ కామెడీలు పేలుతుంటాయి. ఇక ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో సైతం మాట్లాడిన ప్ర‌దీప్.. త‌న‌కు ల‌వ్ క‌మ్ అరేంజ్ మ్యారేజ్ కావాలని.. కానీ ఈ ఏడాది అయితే త‌న పెళ్లి ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

  కాగా ఇదంతా ప‌క్క‌న‌పెడితే.. ప్ర‌దీప్ పెళ్లిచూపులు పేరిట 2018లో స్టార్ మాలో ఒక రియాలిటీ షో ప్రసార‌మైన విష‌యం తెలిసిందే. దీనికి ప్ర‌ముఖ యాంక‌ర్ సుమ వ్యాఖ్య‌తగా చేశారు. ప్ర‌దీప్‌తో పెళ్లిచూపులు కోసం ఇందులో ప‌లువురు పాల్గొన‌గా.. చివ‌రకు ఙ్ఞానేశ్వ‌రి విజేత‌గా నిలిచింది. ఇక బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఈ ఇద్ద‌రి పెళ్లి జ‌రుగుతుంద‌ని అంద‌రూ భావించారు. అయితే అదేం జ‌ర‌గ‌లేదు. కానీ ఙ్ఞానేశ్వ‌రికి మాత్రం మంచి ఇమేజ్‌ని తీసుకొచ్చింది. ఆ ఇమేజ్‌తో సినిమాల్లో అవ‌కాశాల‌ను సొంతం చేసుకుంటూ వ‌చ్చిన ఙ్ఞానేశ్వ‌రి.. ఇప్పుడు మిస్ట‌ర్ అండ్ మిసెస్ అనే మూవీలో హీరోయిన్‌గా న‌టించింది. ఇక ఈ మూవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ప్ర‌దీప్‌తో పెళ్లి గురించి మాట్లాడింది.

  ఆ షో త‌రువాత ప్ర‌దీప్‌తో పెళ్లి ఎందుకు జ‌ర‌గ‌లేదు..? అస‌లు ఆ షోలో ఏం జ‌రిగింది..? అనే ప్ర‌శ్న‌ల‌పై ఙ్ఙానేశ్వ‌రి మాట్లాడింది. పెళ్లి చేసుకోవాల‌ని ఆ షో జ‌ర‌గ‌లేద‌ని.. కేవ‌లం పెళ్లిచూపుల‌ని .. ఒక‌రికొక‌రు అర్థం చేసుకుంటే చేసుకోవ‌చ్చని అప్ప‌ట్లో చెప్పార‌ని ఙ్ఞానేశ్వ‌రి తెలిపింది. మ‌రి మీరు ఏం తెలుసుకోలేదా..? ప‌్ర‌దీప్‌తో ఇప్ప‌టికీ కాంటాక్ట్‌లో ఉన్నారా..? అన్న ప్ర‌శ్న‌కు.. ఇది తాను కెమెరా ముందు చెప్ప‌న‌ని ఙ్ఞానేశ్వ‌రి స్ప‌ష్టం చేశారు.

  Published by:Manjula S
  First published:

  Tags: Anchor pradeep

  ఉత్తమ కథలు