Pelli Sandadi Trailer Review : రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో కొత్ద దర్శకురాలు గౌరీ రోనంకి పరిచయం చేస్తూ.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందడి’ టైటిల్‌తో రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
Pelli Sandadi Trailer Review : దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో అలనాటి అన్న ఎన్టీఆర్ నుంచి కృష్ణ, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వరకు మూడు నాలుగు తరాల హీరోలతో సినిమాలు తెరకెక్కించి సక్సెస్ అందించిన ఘనత దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావుకు దక్కుతుంది. ఈయన చివరగా నాగార్జునతో ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అంతకు ముందు ఓ కొత్త హీరో రేవంత్‌తో ‘ఇంటింటా అన్నమయ్య’ సినిమా తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. మధ్యలో సినిమాలు కాకుండా సీరియల్స్‌తో ప్రేక్షకులను పలకరించారు. దాంతో పాటు ‘బాహుబలి’ వంటి సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.
ప్రస్తుతం దర్శకత్వానికి దూరంగా ఉన్న రాఘవేంద్రరావు .. ఇపుడు ఆయన నిర్మిస్తూ.. దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. శ్రీకాంత్ నయుడు రోషన్(Roshann) హీరోగా ఒకప్పుడు రాఘవేంద్రరావు .. శ్రీకాంత్‌తో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ ‘పెళ్లి సందడి’ టైటిల్‌తోనే ఈ సినిమాను తెరకెక్కించారు.1996లో విడుదలైన పెళ్లిసందడి (Pelli Sandadi) సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించగా.. అందించిన సినిమాగా మారింది. ఇక ఈ సినిమాను రాఘవేంద్ర రావు ప్రస్తుతం మోడ్రన్ పెళ్లి సందడి గా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాతో రాఘవేంద్రరావు నటుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో దర్శకేంద్రుడు ఎలాంటి పాత్ర చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
పెళ్లి సందడి ట్రైలర్ కాసేపటి క్రితమే హీరో మహేష్ బాబు (Mahesh Babu) విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. అంతేకాదు అప్పటి పెళ్లి సందడి సినిమాను గుర్తుకు తెచ్చింది. ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు ఎంతో వినోదాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు అర్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్లో హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ సన్నివేశాలు, కామెడీని చూపించారు.
ఆ తర్వాత హీరో నుంచి హీరోయిన్ ఎందుకు దూరమైంది. మళ్లీ హీరో తాను ప్రేమించిన యువతి ప్రేమను దక్కించుకున్నాడో లేదో అన్నదే ఈ సినిమా స్టోరీలాగా కనిపిస్తోంది. ఒక సినిమాలో హీరో రోషన్‌లో అన్ని యాంగిల్స్ చూపించారు రాఘవేంద్రరావు. పాటలన్ని కూడా మరోసారి రాఘవేంద్రరావు మార్క్‌ను గుర్తుకు తెస్తున్నాయి.
ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఈ సినిమా అలనాటి పెళ్లి సందడి మాదిరిగానే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిస్తుందా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.