యాంకర్‌గా మారిన ఆ దర్శకుడు.. నీకు మాత్రమే చెప్తా అంటూ..

దర్శకులు నటులుగా మారడం చూస్తాం కానీ యాంకర్లుగా మారడం మాత్రం చూడట్లేదు. అసలు మన దర్శకులు చాలా పొదుపుగా మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్లు యాంకర్స్ ఎక్కడ అవుతారులే..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 14, 2020, 8:29 PM IST
యాంకర్‌గా మారిన ఆ దర్శకుడు.. నీకు మాత్రమే చెప్తా అంటూ..
తరుణ్ భాస్కర్ (Tharun Bhascker Dhaassyam)
  • Share this:
దర్శకులు నటులుగా మారడం చూస్తాం కానీ యాంకర్లుగా మారడం మాత్రం చూడట్లేదు. అసలు మన దర్శకులు చాలా పొదుపుగా మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్లు యాంకర్స్ ఎక్కడ అవుతారులే..? కానీ ఈ మధ్య ఓ దర్శకుడు మాత్రం అన్నీ చేస్తున్నాడు. అతడే తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ దర్శకుడు.. ఆ సినిమాతో నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అంటూ మరో సినిమా చేసినా నిరాశ పరిచాడు. ఆ వెంటనే నటుడిగా మారి ఫలక్‌నుమా దాస్ అన్నాడు.. ఆ తర్వాత మీకు మాత్రమే చెప్తా అంటూ హీరో అయిపోయాడు. ఇక ఇప్పుడు యాంకర్ అయిపోయాడు తరుణ్ భాస్కర్. తాజాగా ఈయన హోస్ట్ అయిపోయాడు.

తెలుగు ఇండస్ట్రీలో ఓ దర్శకుడు ఇన్ని వేషాలు మార్చడం ఈ మధ్య ఎప్పుడూ చూడలేదు. కానీ అన్నీ చేస్తున్నాడు తరుణ్ భాస్కర్. ఈటీవీ ప్లస్‌లో నీకు మాత్రమే చెప్తా అంటూ ఓ షో మొదలుపెట్టాడు తరుణ్. ఇందులో టాలీవుడ్ దర్శకులను ఆయన ఇంటర్వ్యూ చేస్తాడు. రెగ్యులర్ ఇంటర్వ్యూలలా కాకుండా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. కచ్చితంగా ఈ షో సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాడు తరుణ్ భాస్కర్. తొలి ఎపిసోడ్ సంచలన దర్శకుడు అనిల్ రావిపూడితోనే మొదలుపెట్టాడు. దాంతో పాటు వెంకటేష్ కోసం ఓ కథ సిద్ధం చేసాడు తరుణ్ భాస్కర్. ఇది కూడా త్వరలోనే పట్టాలెక్కుతుందని క్లారిటీ ఇచ్చాడు ఈయన.
First published: March 14, 2020, 8:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading