సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) మరణంతో ఇప్పటికే శోకసంద్రంలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు మదన్ (Director Madan passes way) ఇకలేరు. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన అర్ధరాత్రి (ఆదివారం) 01.41 గంటల సమయంలో కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్(Hyderabad)లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఐతే అప్పటికే ఆయన పరిస్థితి విషమించింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ.. కోలుకోలేదు.
మదన్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆయన జన్మించారు. డిగ్రీ వరకు చదువు అక్కడే చదువుకున్నారు. కాలేజీ రోజుల్లో నాటకాలు రాసి, దర్శకత్వ వహించేవారు. సినిమా రంగం మీద ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి మొదట చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. టీవీ కార్యక్రమాలు రూపొందించడంతో పాటు డాక్యుమెంటరీలు కూడా తీశారు. మనసంతా నువ్వే, సంతోషం సినిమాల కోసం కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. అనంతరం కల్యాణ రాముడు, ఖుషీఖుషీగా చిత్రాలకు రచయితగా సేవలందించారు.
Punch Prasad: జబర్ధస్త్ పంచ్ ప్రసాద్‌కు ఏమైంది.. నడవలేని స్థితిలో కమెడియన్..
టాలీవుడ్లో మోహన్ బాబు , రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు, ఉదయ్ కిరణ్, ఆది వంటి నటులతో ఆయన పనిచేశారు. రాజేంద్ర ప్రసాద్ సూపర్ హిట్ చిత్రం 'ఆ నలుగురు' సినిమాలో అద్భుతమైన డైలాగ్‌లను రాశారు. అనంతరం 'పెళ్లయిన కొత్తలో..' చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు దర్శకుడిగా పరిచమయ్యారు మదన్. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశారు. గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి చిత్రాలను తెరకెక్కించారు. 2018లో వచ్చిన మోహన్ బాబు మూవీ 'గాయత్రి' ఆయన ఆఖరి సినిమా.
మదన్ మృతి పట్ల నటీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఇవాళ ఆయన స్వగ్రామం మదనపల్లెలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Cinema, Tollywood