Peddanna trailer: రజినీకాంత్ ‘పెద్దన్న’ ట్రైలర్ టాక్.. మాస్ ఆడియన్స్‌కు పూనకాలు..

రజినీకాంత్ పెద్దన్న ట్రైలర్ (Peddanna trailer)

Peddanna trailer: గతంలో అజిత్‌తో (Ajith) వీరమ్ (Veeram), విశ్వాసం (Vishwasam) లాంటి సినిమాల్లో కూడా ఎక్కువగా విలేజ్ కథలనే చూపించాడు శివ. ఇప్పుడు కూడా ఇదే చేసారు. పంచాయతి పెద్దగా రజినీకాంత్ (Rajinikanth) కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్, నయనతార, మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

  • Share this:
Rajinikanth - Peddhanna Trailer : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దసరా పండగ సందర్భంగా  తెలుగులో ఈ సినిమాకు ‘పెద్దన్న’ టైటిల్‌ ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘పెద్దన్న’ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్.. రూ. 12 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార, మీనా, కుష్బూ కథానాయికలుగా నటించారు.

రజినీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో పిక్చరైజ్ చేశారు. దాంతో  పాటు కోల్‌కత్తాలో కూడా కొన్ని సన్నివేశాలను పిక్చరైజ్ చేసారు. ఇక ’పెద్దన్న’గా రాయల్ ఎన్‌ఫీల్డ్ పై వస్తోన్న రజినీకాంత్ లుక్ మాసీగా ఉంది. ఇప్పటికే తెలుగులో మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన ఈ చిత్ర యూనిట్ ..ఇప్పటికే విడుదలైన ‘పెద్దన్న’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదల చేసారు. ఇది కూడా పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతుంది.

NBK Unstoppable Promo: బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ ప్రోమో.. సరదాలో స్టాప్ ఉండదు.. మాటల్లో ఫిల్టర్ ఉండదు..


గతంలో అజిత్‌తో వీరమ్, విశ్వాసం లాంటి సినిమాల్లో కూడా ఎక్కువగా విలేజ్ కథలనే చూపించాడు శివ. ఇప్పుడు కూడా ఇదే చేసారు. పంచాయతి పెద్దగా రజినీకాంత్ కనిపిస్తున్నాడు. మరోవైపు ఇందులో రజినీ ఇంట్రో సాంగ్ దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. రజినీ నటించిన ఎన్నో సినిమాలకు ఇంట్రడక్షన్ సాంగ్స్ ఎస్పీ బాలు పాడారు. గతేడాది సమ్మర్‌లోనే సంగీత దర్శకుడు ఇమాన్ అన్నాత్తే పాటల రికార్డింగ్ పూర్తి చేసాడు.

Sridevi Drama Company Indraja: ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ జడ్జి ఇంద్రజ అసలు పేరు ఎంతమందికి తెలుసు..?


తెలుగు వెర్షన్ ‘పెద్దన్న’ సాంగ్‌ను కూడా ఎస్పీ బాలు గారు ఆలపించారు. త్వరలో  తెలుగు పాటను విడుదల చేయనున్నారు. అన్నాత్తే టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కూడా బాగానే ఉండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగులో కూడా ఈ పాటకు అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  ఈ సినిమా తర్వాత రజినీకాంత్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు  చేతులు మీదుగా దేశంలోనే సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.

Sai Dharam Tej latest health condition: డిశ్చార్జ్ తర్వాత సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నాడు.. బయటికి ఎప్పుడొస్తున్నాడు..?


ఈ అవార్డు అందుకున్న 51వ వ్యక్తి రజినీకాంత్. ఇక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకొని సోలో హీరోగా వెండితెరపై సత్తా చూపెడుతున్న మొదటి హీరో రజినీకాంత్ రికార్డులకు ఎక్కారు. గతంలో అక్కినేని నాగేశ్వరరావు, అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు అందుకొని సినిమాలు చేసినా.. అప్పటికే హీరోగా ఫేడౌట్ అయిపోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ పరిమితమయ్యారు. ఈ రకంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకొని మాస్ హీరోగా వెండితెరపై రజినీకాంత్ సత్తా చూపెడుతూనే ఉన్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: